బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైంలో నిరాశ పరిచే రిజల్ట్ లను సొంతం చేసుకున్న నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి(Arjun Son Of Vyjayanthi Movie)తో సాలిడ్ కంబ్యాక్ ను ఎక్స్ పెర్ట్ చేశాడు…సినిమాకి ఆడియన్స్ నుండి పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ సొంతం అవ్వగా..
ఓపెనింగ్స్ పరంగా రీసెంట్ 2 సినిమాల కన్నా కొంచం బెటర్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది కానీ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా చూసుకుంటే మాత్రం ఇంకా సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పాలి.
మొత్తం మీద సినిమా 2.5-3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటుంది అనుకున్నా హైదరాబాదులో నైట్ షోలకు వర్షాల వలన ఇబ్బంది ఎదురు అవ్వడంతో కొంచం జోరు తగ్గగా మొత్తం మీద సినిమా మొదటి రోజున సినిమా తెలుగు రాష్ట్రాల్లో 2.2 కోట్ల లోపు షేర్ ని అందుకోగా..
ఓవర్సీస్ లో మొత్తం మీద పెద్దగా జోరు చూపించ లేక పోయిన సినిమా ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా 5 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని అయితే దాటింది కానీ ఇంకా జోరు పెంచాల్సిన అవసరం ఉంది. ఇక టోటల్ గా సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Arjun Son Of Vyjayanthi 1st Day Total WW Collections(inc GST)
👉Nizam: 85L~
👉Ceeded: 34L
👉Andhra: 1.00Cr~
AP-TG Total:- 2.19CR(4.10CR~ Gross)
👉Ka+ROI – 18L~
👉OS – 30L~
Total WW Collections – 2.67CR(5.05CR~ Gross)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 22 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొదటి రోజున సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 19.33 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తుందో చూడాలి…