బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ 2 ఫ్లాఫ్ మూవీస్ తో స్లో డౌన్ అయిన నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి(Arjun Son Of Vyjayanthi Movie) తో కంబ్యాక్ కి సిద్ధం అవ్వగా డీసెంట్ కమర్షియల్ ఎలిమెంట్స్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో పర్వాలేదు అనిపించిన సినిమా..
బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ పరంగా హాలిడే అడ్వాంటేజ్ ను ఫుల్లుగా అయితే వాడుకోలేక పోయింది కానీ ఉన్నంతలో మాత్రం రిలీజ్ కి ముందు వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ అండ్ రీసెంట్ కళ్యాణ్ రామ్ మూవీస్ తో పోల్చితే మాత్రం కొంచం పర్వాలేదు అనిపించేలా….
ట్రెండ్ ను అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించింది. మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలతో పోల్చితే ఈవినింగ్ షోల ట్రెండ్ సింగిల్ అండ్ మల్టీ ప్లేసులలో పర్వాలేదు అనిపించేలా గ్రోత్ ని అయితే చూపించగా మొత్తం మీద ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తుంటే..
సినిమా మొదటి రోజున తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్లు ఆ పైన షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి సినిమా కలెక్షన్స్ లెక్క ఇంకా పెరిగే అవకాశం కూడా ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…
ఓవరాల్ గా సినిమా అన్నీ అనుకున్నట్లు జరిగితే 2.2-2.5 కోట్ల ఓపెనింగ్స్ ను అందుకునే ఔట్ రైట్ ఛాన్స్ ఉండగా వరల్డ్ వైడ్ గా కూడా సినిమా ఓవరాల్ గా 2.8-3 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉంది ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే.
ఓవరాల్ గా సినిమా ప్రజెంట్ ఉన్న పరిస్థితులు అలాగే కళ్యాణ్ రామ్ ప్రజెంట్ ఫామ్ దృశ్యా పర్వాలేదు అనిపించేలా ఓపెనింగ్స్ ను చూపెడుతూ ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు ఎంతవరకు జోరు చూపిస్తాయో చూడాలి. కానీ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఇంకా జోరు పెంచాల్సిన అవసరం ఉంది. ఇక ఫస్ట్ డే అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.