బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో రిలీజ్ అయిన మూవీస్ లో డీసెంట్ ప్రమోషన్స్ ని సొంతం చేసుకుని రిలీజ్ అయిన అల్లరి నరేష్(Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ బచ్చల మల్లి(Bachhala Malli Movie) సినిమా, ఉన్నంతలో గ్రాండ్ రిలీజ్ నే సొంతం చేసుకోగా ఆడియన్స్ నుండి సినిమా కి మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా…
సినిమా మాస్ సెంటర్స్ లో కొంచం పర్వాలేదు అనిపించే రేంజ్ లో ఆక్యుపెన్సీని సొంతం చేసుకుంది.. మొత్తం మీద నైట్ షోలకు కొంచం బెటర్ ట్రెండ్ నే చూపించిన సినిమా అనుకున్న అంచనాలను కొద్ది వరకు మించే కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు..
మొదటి రోజు సినిమా 40-50 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోవచ్చు అనుకుంటే మొత్తం మీద మొదటి రోజు ఆన్ లైన్ లో 5.5 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకోగా ఆఫ్ లైన్ లో పర్వాలేదు అనిపించేలా టికెట్ సేల్స్ ను సొంతం చేసుకోగా…
ఓవరాల్ గా మొదటి రోజున తెలుగు రాష్ట్రాల్లో 60 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా ఇండియా లో 70 లక్షల లోపు గ్రాస్ ను సొంతం చేసుకుంది. ఇక ఓవర్సీస్ లో సాధించిన కలెక్షన్స్ తో మొదటి రోజు 80 లక్షల లోపు గ్రాస్ ను ను దక్కించుకుంది ఇప్పుడు….
షేర్ అటూ ఇటూగా 40 లక్షల రేంజ్ లో సొంతం చేసుకున్నా కూడా మొత్తం మీద సినిమా డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే 5.50 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా సినిమా క్లీన్ హిట్ కోసం ఇంకా బెటర్ గా ట్రెండ్ ను చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక వీకెండ్ లో సినిమా ఎలాంటి జోరుని చూపెడుతుందో చూడాలి.