నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా వరల్డ్ వైడ్ గా 1350 వరకు థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా రిలీజ్ కి ముందు రోజు వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ తో…
తెలుగు రాష్ట్రాల్లో ఆల్ మోస్ట్ 7.5 కోట్ల దాకా గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు ఆల్ మోస్ట్ పాజిటివ్ రెస్పాన్స్ తో ఓపెన్ అయిన సినిమా తెలుగు రాష్ట్రాల్లో సూపర్ ఓపెనింగ్స్ తో దూసుకు పోతుంది. ఓవరాల్ గా సినిమా బుకింగ్స్ బాలయ్య నటించిన వీర సింహా రెడ్డి(Veera Simha Reddy) సినిమాతో పోల్చితే చాలా తక్కువగానే ఉన్నాయి అని చెప్పాలి.
అదే టైంలో బాలయ్య నటించిన అఖండ(Akhanda Movie) తో కంపేర్ చేస్తే ట్రాక్ చేసిన సెంటర్స్ లో సిమిలర్ గా ట్రెండ్ అవుతున్నాయి. దాంతో సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు అన్ని చోట్లా ఇదే విధంగా ట్రెండ్ కంటిన్యూ అయితే సినిమా 14 కోట్లకు అటూ ఇటూగా షేర్ ని అందుకోవచ్చు.
సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సీడెడ్ లో అండ్ ఆంధ్రలో జోరు పెంచే అవకాశం ఉండటంతో ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తుంది అని చెప్పాలి. ఓవర్సీస్ లో కూడా స్లో బుకింగ్స్ తర్వాత మంచి జోరు ని చూపిస్తున్న సినిమా కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా లో సినిమా…
లియో డామినేషన్ వలన స్లో అవ్వక తప్పలేదు. అయినా కానీ ఓవరాల్ గా మొదటి రోజున బాలయ్య మాస్ రచ్చ నే చూపిస్తున్నాడు అని చెప్పాలి. ఇక డే 1 ఎండ్ అయ్యే టైం కి సినిమా ఎంతవరకు ఇదే జోరు ని చూపించి కలెక్షన్స్ పరంగా ఇంప్రూవ్ మెంట్ ను చూపిస్తుందో చూడాలి ఇక…