బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్(BellamKonda Srinivas) నారా రోహిత్(Nara Rohit) మరియు మంచు మనోజ్(Manchu Manoj) కీలక పాత్రలు పోషిస్తున్న భైరవం(Bhairavam Movie) సినిమా ఆడియన్స్ నుండి పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.
ముఖ్యంగా మాస్ సెంటర్స్ నుండి సినిమాకి మంచి రెస్పాన్స్ సొంతం అవ్వగా ఓపెనింగ్స్ పరంగా ఎలాంటి ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంటుంది అన్నది ఆసక్తిగా మారగా సినిమా తెలుగు రాష్ట్రాల్లో పోటి గా కొత్త సినిమాలు ఏమి లేకున్నా కూడా…
ఆడియన్స్ లో సాలిడ్ క్రేజ్ ఉన్న మహేష్ ఖలేజా(Khaleja Movie) నుండి తీవ్రమైన పోటిని సొంతం చేసుకుంది. దాంతో టికెట్ సేల్స్ పరంగా ఆ సినిమా ఫుల్లుగా డామినేట్ చేస్తూ ఉండగా ఉన్నంతలో మాస్ సెంటర్స్ లో భైరవం పర్వాలేదు అనిపించేలా ట్రెండ్ ను…
చూపెడుతూ ఉండగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈవినింగ్ అండ్ నైట్ షోలకు కూడా బుకింగ్స్ ట్రెండ్ పర్వాలేదు అనిపించే విధంగా ఉండగా ఓవరాల్ గా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా మొదటి రోజున తెలుగు రాష్ట్రాల్లో 1.5-1.8 కోట్ల రేంజ్ లో వసూళ్ళని…
అందుకునే అవకాశం ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో చూపించే జోరుని బట్టి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ ఎంతవరకు పెరుగుతాయో చూడాలి… ఓవరాల్ గా చూసుకుంటే ఇంకా బెటర్ ట్రెండ్ ను చూపించాల్సింది కానీ ఉన్నంతలో పోటిలో పర్వాలేదు అనిపిస్తుంది. ఇక డే ఎండ్ అయ్యే టైంకి సినిమా ఎలాంటి హోల్డ్ ని చూపిస్తుందో చూడాలి.