Home న్యూస్ భారతీయుడు2 ఫస్ట్ డే కలెక్షన్స్…..తాత మాస్ రాంపెజ్!!

భారతీయుడు2 ఫస్ట్ డే కలెక్షన్స్…..తాత మాస్ రాంపెజ్!!

0
Bharateeyudu2/Indian2 Movie 1st Day Box Office Collections Update
Bharateeyudu2/Indian2 Movie 1st Day Box Office Collections Update

బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకున్న లోక నాయకుడు కమల్ హాసన్(Kamal Haasan) నటించిన లేటెస్ట్ మూవీ భారతీయుడు2 (Bharateeyudu2 Movie 1st Day Collections) సినిమా మొదటి రోజు మిక్సుడ్ టాక్ తో కూడా మాస్ రాంపెజ్ ను చూపించి దుమ్ము లేపింది అని చెప్పాలి ఇప్పుడు….

రిలీజ్ కి ముందు రోజు ప్రీ బుకింగ్స్ తో రచ్చ లేపిన సినిమా రిలీజ్ అయిన తర్వాత మిక్సుడ్ రెస్పాన్స్ ఇంపాక్ట్ ఉన్నా కూడా మంచి ఓపెనింగ్స్ నే అందుకుంది అన్ని చోట్లా… ఇండియన్ తాత మొదటి రోజు మంచి రచ్చే చేయగా తమిళ్ కి ధీటుగా తెలుగులో భారతీయుడు2 మూవీ మంచి జోరునే చూపించింది…

మొత్తం మీద ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా తెలుగు రాష్ట్రాల్లో 9-10కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కూడా బాగుంటే గ్రాస్ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంది… ఇక తమిళ్ ఆన్ లైన్ బుకింగ్స్ కొంచం వీక్ గానే ఉన్నా…

ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగానే ఉండటంతో 12-14 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉండగా హిందీ, కర్ణాటక, కేరళ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద….

8 కోట్లకు అటూ ఇటూగా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా…ఓవర్సీస్ లో మాత్రం సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో 3 మిలియన్ డాలర్స్ కి అటూ ఇటూగా కలెక్షన్స్ ని ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్స్ తో అందుకునే అవకాశం ఉంది…

దాంతో ఓవరాల్ గా సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 55-58 కోట్లకు అటూ ఇటూగా కలెక్షన్స్ ని అందుకోవచ్చు, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండొచ్చు. ఇక డే 1 అఫీషియల్ కలెక్షన్స్ ఈ అంచనాలను అందుకుంటాయో లేదో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here