Home న్యూస్ ఛావా తెలుగు 1st డే ఓపెనింగ్స్….కుమ్ముతుందిగా సినిమా!!

ఛావా తెలుగు 1st డే ఓపెనింగ్స్….కుమ్ముతుందిగా సినిమా!!

0

హిందీలో బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ సీజన్ లో ఊహకందని కలెక్షన్స్ తో రికార్డులను క్రియేట్ చేసిన విక్కీ కౌశల్(Vicky Kaushal) నటించిన లేటెస్ట్ మూవీ ఛావా(Chhaava Telugu) తెలుగు లో ఈ వీకెండ్ లో డబ్ అయ్యి రిలీజ్ అవ్వగా…ఆల్ రెడీ హిందీ లో వచ్చిన సెన్సేషనల్ రెస్పాన్స్ వలన తెలుగు లో డబ్ కి డిమాండ్ ఏర్పడగా….

తెలుగు లో సినిమాను గ్రాండ్ గా ఇప్పుడు రిలీజ్ చేయగా…రిలీజ్ కి 2 రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ సినిమాకి ఓపెన్ అవ్వగా కొత్త సినిమాలలోకి బెస్ట్ అనిపించే రేంజ్ లో ఆల్ మోస్ట్ 20 వేలకు పైగా ప్రీ బుకింగ్స్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసిన సినిమా…

రిలీజ్ రోజున తెలుగు రాష్ట్రాల్లో మేజర్ సెంటర్స్ లో ఎక్స్ లెంట్ బుకింగ్స్ తో ఓపెనింగ్స్ పరంగా కుమ్మేస్తున్న సినిమా మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల బుకింగ్స్ ట్రెండ్ అలాగే ఈవినింగ్ షోల అడ్వాన్స్ బుకింగ్స్ సాలిడ్ గా ఉండటంతో ఓవరాల్ గా ప్రజెంట్ ట్రెండ్ ను…

చూస్తూ ఉంటే మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో సినిమా అవలీలగా కోటి కి పైగా నే గ్రాస్ ను అందుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా…ఈవినింగ్ అండ్ నైట్ షోల ట్రెండ్ బాగుంటే కలెక్షన్స్ లెక్క 1.2 కోట్ల రేంజ్ దాకా వెళ్ళే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి..

మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ సీజన్ లో పరీక్షల సమయంలో ఎక్స్ లెంట్ బుకింగ్స్ ను సొంతం చేసుకుంటూ ఉండటం విశేషం కాగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా డే 1 కలెక్షన్స్ పరంగా ఈ అంచనాలను ఎంతవరకు మించిపోతుందో లేక ఇదే రేంజ్ లో వసూళ్ళని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here