బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ సీజన్ లో తెలుగు రాష్ట్రాల్లో ఒక పక్క కొత్త సినిమాలు పెద్దగా ఇంపాక్ట్ ని ఏమి చూపించ లేక పోతున్న టైంలో….హిందీలో రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఊహకందని కలెక్షన్స్ తో ఊచకోత కోసిన విక్కీ కౌశల్(Vicky Kaushal) నటించిన లేటెస్ట్ మూవీ ఛావా(Chhaava Telugu) తెలుగులో డబ్ అయ్యి రిలీజ్ అవ్వగా…
రిమార్కబుల్ రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకున్న ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా అంచనాలను అన్నీ కూడా మించి పోయే రేంజ్ లో ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసింది….సినిమా మొదటి రోజు ఓవరాల్ గా బుక్ మై షోలో….
55 వేలకు పైగా టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించగా 2 కోట్లు ఆ పైన గ్రాస్ ఓపెనింగ్స్ ను సాధించవచ్చు అనుకున్న ఈ సినిమా ఈ అంచనాలను సైతం నైట్ షోలలో ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపించి ఊహకందని రాంపెజ్ తో…
ఏకంగా 2.90 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను తొలిరోజు సాధించింది…ఆల్ మోస్ట్ 1.5 కోట్ల రేంజ్ లో షేర్ ని మొదటి రోజున సొంతం చేసుకున్న ఈ సినిమా ఊహకందని ఊచకోత కోసింది మొదటి రోజున….సినిమా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తెలుగు లో…
3 కోట్ల రేంజ్ లో ఉండగా అందులో సగం టార్గెట్ ను సినిమా మొదటి రోజే అందుకుని సంచలనం సృష్టించడం విశేషం అని చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ లోనే తెలుగు లో ఇప్పుడు బ్రేక్ ఈవెన్ ని దాటేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక లాంగ్ రన్ లో మేకర్స్ కి సాలిడ్ ప్రాఫిట్స్ ను సొంతం చేసిపెట్టే అవకాశం ఎంతైనా ఉంది.