నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్(Daaku Maharaaj Movie) బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా గ్రాండ్ గా రిలీజ్ అవ్వగా మొదటి రోజు మంచి టాక్ ను సొంతం చేసుకున్న సినిమా షో షో కి మంచి ట్రెండ్ ను చూపెడుతూ బాలయ్య కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఓపెనింగ్స్ దిశగా దూసుకు పోతుంది ఇప్పుడు…
ఓవర్సీస్ లో ఆల్ రెడీ ప్రీమియర్స్ తో కెరీర్ బెస్ట్ రికార్డ్ ను నమోదు చేసిన సినిమా మొదటి రోజు కూడా సాలిడ్ ట్రెండ్ ను చూపెడుతుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఓపెనింగ్స్ బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను అందుకున్న వీర సింహా రెడ్డి కి చేరువ అయ్యే రేంజ్ లో ఉండగా…
నైట్ షోలకు సాలిడ్ ఓవర్ ఫ్లో ఉంటే అంచనాలను మించి పోయే అవకాశం ఎంతైనా ఉండగా మొత్తం మీద ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తుంటే 20 కోట్ల షేర్ మార్క్ ని దాటే అవకాశం ఎంతైనా ఉండగా…ఇక ఆఫ్ లైన్ అండ్ ఓవర్ ఫ్లో జోరు సాలిడ్ గా ఉంటే ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉంది…
ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా లో కూడా మంచి జోరుని చూపిస్తున్న సినిమా వరల్డ్ వైడ్ గా ఇప్పుడు 28-30 కోట్ల రేంజ్ లో షేర్ ని టార్గెట్ చేసే అవకాశం కనిపిస్తుంది…ఓవరాల్ గా డీసెంట్ ఓపెనింగ్స్ తో స్టార్ట్ అయిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు సాలిడ్ ఓపెనింగ్స్ తో…
బాలయ్య కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఓపెనింగ్స్ ను అందుకునే దిశగా దూసుకు పోతూ ఉండటం విశేషం…సంక్రాంతి వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మంచి రాంపెజ్ ను చూపించే అవకాశం ఎంతైనా ఉంది. ఇక మొదటి రోజు కి గాను సినిమా ఓవరాల్ గా సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.