Home న్యూస్ 1st డే డిమోంటి కాలనీ 2 కలెక్షన్స్….అంచనాలను మించి వచ్చాయిగా!!

1st డే డిమోంటి కాలనీ 2 కలెక్షన్స్….అంచనాలను మించి వచ్చాయిగా!!

0
Demonte Colony2 Telugu 1st Day Box Office Collections
Demonte Colony2 Telugu 1st Day Box Office Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర ఆగస్టు 15 వీకెండ్ లో తమిళ్ లో రిలీజ్ మంచి క్రేజ్ నడుమ రిలీజ్ అయిన తంగలాన్(Thangalaan Movie)ని సైతం డామినేట్ చేసి సూపర్ హిట్ గా దూసుకు పోయిన డిమోంటి కాలనీ 2(Demonte Colony2 Telugu 1st Day Collections) సినిమాను తెలుగులో ఈ వీక్ లో రిలీజ్ చేయగా సినిమాకి ఇక్కడ…

ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ సొంతం అవ్వగా ప్రీవియస్ వీక్ లో రిలీజ్ అయిన పెద్ద సినిమాలు పెద్దగా ఇంప్రెస్ చేయకపోవడంతో ఆ ఇంపాక్ట్ కొత్త సినిమాల మీద కూడా పడుతుంది అనుకోగా, అందునా డబ్ మూవీ అవ్వడం, స్టార్ కాస్ట్ గురించి పెద్దగా ఎవరికీ తెలియకపోవడంతో…

తెలుగులో ఎలాంటి ఓపెనింగ్స్ ను అందుకుంటుంది అనుకున్నా కూడా మొత్తం మీద డిమోంటి కాలనీ 2 మొదటి రోజు అంచనాలను మించే ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపింది. ఆల్ మోస్ట్ 12 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా మొదటి రోజు…

తెలుగు రాష్ట్రాల్లో ఆల్ మోస్ట్ 70 లక్షల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపగా షేర్ ఆల్ మోస్ట్ 36-40 లక్షల దాకా ఉంటుందని అంచనా…ఇక రెండో రోజు కూడా సినిమా మంచి జోరుని చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

ఇక సినిమా తెలుగు బిజినెస్ లెక్కలు క్లియర్ గా రివీల్ చేయలేదు కానీ వాల్యూ బిజినెస్ రేంజ్ 2.5 కోట్లకు పైగా ఉంటుందని అంచనా…ఆ లెక్కన సినిమా 3 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని సినిమా కనుక సొంతం చేసుకుంటే తెలుగులో డీసెంట్ హిట్ గా నిలుస్తుంది అని చెప్పొచ్చు. ఇక తెలుగులో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here