బాక్స్ ఆఫీస్ దగ్గర 6 ఏళ్ల తర్వాత సోలో మూవీ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) ఆచార్య లాంటి ఎపిక్ డిసాస్టర్ తర్వాత కొరటాల శివ డైరెక్షన్ లో చేసిన దేవర(Devara Part 1 first Day Box Office Collections) తో మాస్ రచ్చ చేశాడు….అడ్వాన్స్ బుకింగ్స్ నుండే ఊచకోత కోసిన ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా…
ట్రాక్ చేసిన సెంటర్స్ లో ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించగా ఆఫ్ లైన్ లో టికెట్ సేల్స్ పరంగా ఇదే రాంపెజ్ కొనసాగే అవకాశం ఎంతైనా ఉండటంతో మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎన్టీఆర్ కెరీర్ లో సోలో హీరోగా బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రికార్డులను నమోదు చేయబోతుంది ఇప్పుడు..
నైజాంలో రిమార్కబుల్ అడ్వాన్స్ బుకింగ్స్ తర్వాత మొదటి రోజు ఎక్స్ లెంట్ ఆక్యుపెన్సీని ఓవరాల్ గా సొంతం చేసుకోగా రీసెంట్ టైంలో ఇక్కడ వన్ ఆఫ్ ది బెస్ట్ ఓపెనింగ్స్ ను అందుకోబోతుంది. షో కౌంట్ ఎక్కువ అవ్వడంతో మరీ అనుకున్న రేంజ్ లో ఫుల్స్ పడక పోయినా…
ఓవరాల్ గా ఆక్యుపెన్సీతో సాలిడ్ నంబర్స్ ను రాబట్టబోతుంది సినిమా…ఇక ఆంధ్ర సీడెడ్ ఏరియాల్లో అయితే రిమార్కబుల్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్న సినిమా చాలా సినిమాల ఓపెనింగ్ డే రికార్డులను ఇక్కడ బ్రేక్ చేయబోతుంది…దాంతో మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో…
అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 44-46 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం మించి పోయి 48-50 ఛాన్స్ కూడా ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక కర్ణాటకలో ఎక్స్ లెంట్ స్టార్ట్ ను సొంతం చేసుకున్న సినిమా తమిళ్ మరియు కేరళ ఏరియాల్లో…
ఓకే అనిపించే రేంజ్ లోనే ఓపెనింగ్స్ ను అందుకోబోతుండగా ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే ఓవరాల్ కలెక్షన్స్ పెరగవచ్చు. హిందీ లో స్లో స్టార్ట్ తర్వాత బాగానే పుంజుకుంది సినిమా…. ఓవరాల్ గా ఇండియా లో మొదటి రోజు సినిమా ఇప్పుడు 58-60 కోట్ల రేంజ్ లో షేర్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉండగా…
ఓవర్సీస్ లో సెన్సేషనల్ స్టార్ట్ ను సొంతం చేసుకున్న సినిమా ప్రీమియ్ర్స్ తో ఆల్ రెడీ టాప్ 3 బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను అందుకోగా ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్స్ సూపర్బ్ గా ఉండే అవకాశం ఉండగా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా సినిమా 76 కోట్లకు పైగానే….
ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉంది. ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండొచ్చు. ఎన్టీఆర్ కెరీర్ లో ఇవి సోలో హీరోగా బిగ్గెస్ట్ రికార్డ్ ఓపెనింగ్స్…ఇక మొదటి రోజు సినిమా ఈ అంచనాలను మించి పోతుందా లేక ఇక ఇవే రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి ఇప్పుడు.