టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) కొరటాల శివల లేటెస్ట్ మూవీ దేవర(Devara 1st Day Collections Openings) భారీ లెవల్ లో రిలీజ్ ను సొంతం చేసుకోగా, అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా ఆల్ రెడీ సెన్సేషనల్ రాంపెజ్ ను చూపించిన సినిమా ఇప్పుడు మొదటి రోజు ఓపెనింగ్స్ పరంగా మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతుంది.
సినిమా తెలుగు రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను నమోదు చేయడానికి సిద్ధం అవుతూ ఉండగా ఆంధ్ర సీడెడ్ ఏరియాల్లో బుకింగ్స్ ట్రెండ్ మరో లెవల్ లో ఉండటం విశేషం అని చెప్పాలి. ఇక నైజాం లో కూడా సినిమా బుకింగ్స్ ఓ రేంజ్ లో కుమ్మేస్తూ ఉండటం విశేషం…
సినిమా ప్రజెంట్ ట్రెండ్ ను చూస్తూ ఉంటే మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 40 కోట్లకు పైగా షేర్ ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా అన్ని చోట్లా స్పెషల్ షోలు, ఎక్స్ ట్రా షోల అడ్వాంటేజ్ తో మొదటి రోజు డే ఎండ్ అయ్యే టైంకి లెక్క ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉంది.
ఓవరాల్ గా డే ని సినిమా 45 కోట్లకు పైగానే సొంతం చేసుకునే అవకాశం ఉండగా….గ్రాస్ లెక్క 65-70 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం ఎంతైనా ఉంది. ఇక కర్ణాటకలో డబుల్ డిజిట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోబోతుండగా, హిందీ….తమిళ్…కేరళలో యావరేజ్ ఓపెనింగ్స్ ను అందుకోబోతున్న సినిమా…
ఓవర్సీస్ లో మాత్రం ఫెంటాస్టిక్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోబోతుండగా వరల్డ్ వైడ్ గా మొదటి రోజు ఇప్పుడు సినిమా 115-120 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి ఈ కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండొచ్చు.
ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్టీఆర్ కెరీర్ లో సోలో హీరోగా రికార్డ్ బ్రేకింగ్ స్టార్ట్ ను సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా డే ఎండ్ అయ్యే టైంకి సినిమా మరింత జోరు చూపిస్తే ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.