బాక్స్ ఆఫీస్ దగ్గర 2025 ఇయర్ ఫస్ట్ బిగ్ మూవీ అయిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) శంకర్(Shankar) ల గేమ్ చేంజర్(Game Changer) సినిమా మంచి అంచనాల నడుమ రిలీజ్ అవ్వగా తొలిరోజు కలెక్షన్స్ పరంగా బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ లో అంచనాలను అందుకోలేక పోయింది…. సోషల్ మీడియాలో అటు ఆఫ్ లైన్ లో భారీగా స్ప్రెడ్ అయిన…
మిక్సుడ్ టాక్ ఇంపాక్ట్ వలన సినిమా తొలిరోజు కలెక్షన్స్ పూర్తిగా అంచనాలను అందుకోలేక పోయాయి…వరల్డ్ వైడ్ గా 100 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని దాటుతుంది అనుకున్నా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు పూర్తిగా అంచనాలను అందుకోలేక పోయాయి….దాంతో సినిమా మొదటి రోజు…
92 కోట్ల రేంజ్ లోనే గ్రాస్ కలెక్షన్స్ మార్క్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది… తెలుగు రాష్ట్రాల్లో 40-42 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు అనుకున్నా కూడా ఓవరాల్ గా 39 కోట్లకు పైగా షేర్ ని మాత్రమే సొంతం చేసుకుంది… రీసెంట్ టైం లో టాప్ స్టార్స్ మూవీస్ లో మొదటి రోజున…
కలెక్షన్స్ పరంగా అంచనాలను అన్ని సినిమాలు మించి పోయే ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్నా కూడా గేమ్ చేంజర్ సినిమా మాత్రం రివర్స్ లో అంచనాలను అందుకోలేక పోయింది మొదటి రోజున… ఇక మొదటి రోజున వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే..
Game Changer 1st Day Total World Wide Collections Report
👉Nizam: 10.94CR(Inc ALL)
👉Ceeded: 5.82CR
👉UA: 5.64CR
👉East: 4.85CR(1.8CR~ hires)
👉West: 2.42CR(65L~ Hires)
👉Guntur: 4.36CR(2.1CR~ Hires)
👉Krishna: 3.12CR(76L~ Hires)
👉Nellore: 2.37CR(95L Hires)
(1.20CR~hires,Mgs, SGs added in several places)
AP-TG Total:- 39.52CR(53.25CR~ Gross)(7.46Cr Hires, Mgs, SGs)
👉KA: 2.45Cr(4.85Cr Gross)
👉Tamilnadu: 1.25Cr(2.80Cr~ Gross)
👉Kerala: 10L~(25L~ Gross)
👉Hindi+ROI: 4.25Cr(11.90Cr~ Gross)
👉OS – 8.85Cr(19.20Cr~ Gross)****approx
Total WW Collections: 56.42CR(Gross- 92.25CR~)
(25%~ Recovery)
మొత్తం మీద సినిమా 223 కోట్ల భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగగా తొలిరోజు సాధించిన కలెక్షన్స్ తో 25% రేంజ్ లో రికవరీని సొంతం చేసుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ కోసం ఏకంగా మరో 166.58 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించాల్సిన అవసరం ఉంది. ఇక సంక్రాంతి వీకెండ్ లో ఇతర సినిమాల పోటిని తట్టుకుని సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.