బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ ఇండియా వైడ్ గా బిగ్గెస్ట్ రిలీజ్ ను సొంతం చేసుకున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) శంకర్(Shankar) ల గేమ్ చేంజర్(Game Changer) సినిమా మంచి అంచనాల నడుమ రిలీజ్ అవ్వగా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ చాలా లేట్ గా ఓపెన్ చేసినా కూడా రిలీజ్ కి ముందు రోజు బుకింగ్స్ ట్రెండ్ సాలిడ్ గా ఉండగా…
రిలీజ్ రోజు కి ముందే 50 కోట్ల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసిన ఈ సినిమా రిలీజ్ రోజున కూడా టికెట్ సేల్స్ లో సాలిడ్ ట్రెండ్ ను చూపెడుతూ దూసుకు పోతుంది. ఒక పక్క సోషల్ మీడియాలో సినిమా మీద మిక్సుడ్ రెస్పాన్స్ స్ట్రాంగ్ గా స్ప్రెడ్ అవుతున్నా కూడా…
బుక్ మై షో లో ప్రతీ గంటలో టికెట్ సేల్స్ ఎక్స్ లెంట్ గా కొనసాగుతూ ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో సినిమా బుకింగ్స్ మంచి ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా సాలిడ్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. కానీ ఓవరాల్ గా ప్రజెంట్ బుకింగ్స్…
రీసెంట్ పాన్ ఇండియా మూవీస్ తో పోల్చితే మట్టుకు కొంచం వీక్ గానే ఉండగా ప్రజెంట్ ఓపెనింగ్స్ ను బట్టి సినిమా తెలుగు రాష్ట్రాల్లో 40-45 కోట్ల రేంజ్ లో షేర్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోల ట్రెండ్ ను బట్టి ఎంతవరకు ముందుకు వెళుతుందో చెప్పగలం.
ఒక ఓవర్సీస్ ప్రీమియర్స్ పూర్తి రిపోర్ట్ లు డే 1 కలెక్షన్స్ తో కలిసి రాబోతూ ఉండగా నార్త్ అమెరికాలో రిపోర్ట్ అయిన గ్రాస్ 1 మిలియన్ లోపే ఉంది…ఇక హిందీ లో బుకింగ్స్ ట్రెండ్ పర్వాలేదు అనిపించేలా ఉండగా తమిళ్ లో శంకర్ ఫ్యాక్టర్ వలన బుకింగ్స్ ట్రెండ్ బాగుంది…
కర్ణాటకాలో కూడా మంచి బుకింగ్స్ ఉండగా కేరళలో పెద్దగా ఇంపాక్ట్ లేదు…ఓవరాల్ గా ఓపెనింగ్స్ ను బట్టి చూస్తుంటే డే మొత్తం బుకింగ్స్ ట్రెండ్ ఇలానే సాలిడ్ గా కొనసాగితే మొదటి రోజు వరల్డ్ వైడ్ గా సినిమా 60 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం ఉంది.
ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోల ట్రెండ్ ను బట్టి కలెక్షన్స్ ఇదే రేంజ్ లో ఉంటాయా లేక ఇంతకు మించిన జోరు చూపించ గలుగుతాయో చూడాలి ఇక…కానీ సినిమా కి కొంచం టాక్ మిక్సుడ్ గా వస్తూ ఉండటంతో డే ఎండ్ అయ్యే టైంకి ఎలాంటి హోల్డ్ ని చూపిస్తుందో చూడాలి.