బాక్స్ ఆఫీస్ దగ్గర నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) సినిమాతో మాస్ రచ్చ చేస్తూ ఉండగా అన్ని చోట్లా సెన్సేషనల్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంటూ ఊచకోత కోస్తూ ఉండగా నార్త్ అమెరికాలో ఆల్ రెడీ ప్రీమియర్స్ తో ఊహకందని ఓపెనింగ్స్ ను నమోదు చేశాడు. అక్కడ మీడియం రేంజ్ హీరోల…
సినిమాల్లో బిగ్గెస్ట్ రికార్డ్ ను నమోదు చేయగా ఇప్పుడు…తెలుగు రాష్ట్రాల్లో కూడా సెన్సేషనల్ ఓపెనింగ్స్ ను నమోదు చేస్తూ దూసుకు పోతుంది. ఈ ఇయర్ సంక్రాంతి సీజన్ తర్వాత మళ్ళీ చాలా వరకు థియేటర్స్ ఈ రోజున కళకళలాడుతూ ఉండటం విశేషం అని చెప్పాలి.
నైజాంలో ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపెడుతున్న సినిమా, ఆంధ్రలో లేట్ గా బుకింగ్స్ ను ఓపెన్ చేసినా ఓపెన్ చేసిన తర్వాత మాస్ రచ్చ చేస్తూ ఉంది. దాంతో ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో టాలీవుడ్ మీడియం రేంజ్ మూవీస్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను..
సినిమా సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా డబుల్ డిజిట్ షేర్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోలకి ట్రెండ్ ఇంకా పెరిగితే మాత్రం ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.
ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఇతర వర్షన్ లు చాలా లిమిటెడ్ గానే రిలీజ్ అవ్వగా తెలుగు వర్షన్ మాత్రం మాస్ కుమ్ముడు కుమ్మేస్తుంది. ఇక ఓవర్సీస్ లో ఆల్ రెడీ రికార్డుల జాతర సృష్టిస్తున్న సినిమా వరల్డ్ వైడ్ గా ఇప్పుడు మొదటి రోజున…
16-18 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోల ట్రెండ్ ను బట్టి ఈ లెక్క ఇలానే ఉంటుందా లేక మించి ఇంకా పెరిగే అవకాశం ఉంటుందో చూడాలి ఇప్పుడు…