బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో రిలీజ్ అయిన మూవీస్ లో హాలీవుడ్ నుండి ఇండియాలో డబ్ అయిన జురాసిక్ వరల్డ్: రీ బర్త్(jurassic world rebirth Movie) ఒకటి…ఇప్పటి వరకు ఈ సిరీస్ లో 6 సినిమాలు రాగా ఆడియన్స్ కి రొటీన్ అయిపోయిన డైనోసార్స్ నే మళ్ళీ మళ్ళీ చూపెడుతూనే ఉండటంతో ఈ సారి సినిమా మీద…
మరీ అంతలా అంచనాలు ఏర్పడలేదు….ఇక ఈ సినిమా లో కూడా మరోసారి డైనోసార్స్ మనుషుల పై దాడి చేయడం మొదలు పెట్టగా….ఎలా కొందరు తప్పించుకున్నారు అన్న కాన్సెప్ట్ తోనే మరోసారి సినిమా రూపొందగా పెద్దగా కొత్తదనం ఏమి లేక పోవడం…
అవే డైనోసార్స్…అవే యాక్షన్ సీన్స్ నే మళ్ళీ రిపీట్ చేసినట్లు అనిపించడంతో పెద్దగా ఇంప్రెస్ అయితే సినిమా చేయలేక పోయింది అని చెప్పాలి. ఇండియాలో కూడా సినిమాకి ఆడియన్స్ నుండి ఒకింత మిక్సుడ్ రెస్పాన్స్ ఉందని చెప్పాలి సినిమా కి…
ఇక ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ఓపెనింగ్స్ పరంగా ఇంపాక్ట్ ని ఏమి చూపించ లేక పోయిన ఈ సినిమా మొదటి రోజు అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మెన్స్ ను చూపించ లేక పోయింది. ఓవరాల్ గా మొదటి రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు…
3.5 కోట్ల రేంజ్ లోనే ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది…ఓవరాల్ గా వీకెండ్ లో 12 కోట్లు ఆ పైన నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని అంటున్నారు కానీ ఈ సిరీస్ లు ఇది వరకు వచ్చిన మూవీస్ కి మంచి ఓపెనింగ్స్ దక్కగా ఈ సినిమాకి మాత్రం పెద్దగా కలెక్షన్స్ దక్కే అవకాశం తక్కువగానే కనిపిస్తుంది ఇప్పుడు.