బాక్స్ ఆఫీస్ దగ్గర నికార్సయిన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న కోలివుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) నటించిన లేటెస్ట్ మూవీ కంగువ(Kanguva 1st Day Collections) భారీ లెవల్ లో రిలీజ్ ప్లాన్ చేసినా లాస్ట్ మినట్ లో తమిళనాడులో తెలుగు లో ఇబ్బందులు ఫేస్ అయినా కూడా…సూర్య కెరీర్ లోనే…
బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను నమోదు చేస్తూ మాస్ రచ్చ చేస్తున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో డబ్బింగ్ మూవీస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్టార్ట్ ను సొంతం చేసుకోబోతుంది. ఇతర సినిమాలు పోటి లో ఉన్నా కూడా… సూర్య కంగువ మూవీనే ఆడియన్స్ ఫస్ట్ ఛాయిస్ గా నిలిచింది…
నైజాం, ఆంధ్ర సీడెడ్ అన్ని ఏరియాల్లో సినిమా ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను అందుకోబోతూ ఉండగా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే 3 కోట్లకు పైగానే షేర్ ఓపెనింగ్స్ ను సినిమా సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ లెక్కలు కనుక బాగుండి…
డే 1 ఎండ్ అయ్యే టైంకి మరింత జోరుని సినిమా చూపిస్తే ఈ అంచనాలను సైతం సినిమా మించే అవకాశం ఉంది. ఆఫ్ లైన్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి. ఇక తమిళనాడులో లిమిటెడ్ రిలీజ్ లో దుమ్ము లేపే రేంజ్ లో ఓపెనింగ్స్ తో కుమ్మేస్తున్న ఈ సినిమా 10-12 కోట్లకు పైగానే గ్రాస్ ను అందుకునే…
అవకాశం ఎంతైనా ఉండగా, ఈవినింగ్ అండ్ నైట్ షోల లెక్కలను బట్టి ఇంకా జోరు పెంచే అవకాశం ఉంది. ఇక సినిమా కర్ణాటక, కేరళ, హిందీలో కూడా మంచి జోరునే చూపెడుతూ ఉండగా ప్రజెంట్ ట్రెండ్ చూస్తుంటే ఇండియాలో సినిమా మొదటి రోజు…
26-28 కోట్ల రేంజ్ లో అందుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా ఆఫ్ లైన్ లెక్కలు, ఈవినింగ్ షోల ట్రెండ్ ను బట్టి కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక ఓవర్సీస్ లో కూడా కుమ్మేసే అవకాశం ఉన్న నేపధ్యంలో సినిమా వరల్డ్ వైడ్ గా 40 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకోవచ్చు. ఇక డే ఎండ్ అయ్యే టైంకి సినిమా ఎలాంటి హోల్డ్ ని చూపెడుతుందో చూడాలి.