బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైంలో వరుస ఫ్లాఫ్స్ తో సతమతం అవుతూ రీసెంట్ గా స్కై ఫోర్స్ సినిమాతో పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్(Akshay Kumar) నటించిన లేటెస్ట్ మూవీ కేసరి చాప్టర్2(Kesari Chapter 2 Movie) రీసెంట్ గా రిలీజ్ అవ్వగా…
సినిమాకి ఆడియన్స్ నుండి యునానిమస్ రెస్పాన్స్ అయితే సొంతం అయ్యింది అని చెప్పాలి….రీసెంట్ టైంలో అక్షయ్ కుమార్ మూవీస్ లో ఈ రేంజ్ లో యునానిమస్ రెస్పాన్స్ మాత్రం ఈ సినిమాకే సొంతం అయ్యింది అని చెప్పాలి…
దాంతో మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల ట్రెండ్ వీక్ గా ఉన్నా కూడా తర్వాత షోలకి మంచి జోరుని చూపెడుతుంది అనుకున్నా కూడా ఓవరాల్ గా మొదటి రోజు కలెక్షన్ ఇప్పుడు ఒకింత శాకిచ్చే రేంజ్ లో వచ్చాయి అని చెప్పాలి..ఈ రేంజ్ లో యునానిమస్ రెస్పాన్స్ వచ్చినా కూడా..
మొదటి రోజున సినిమా ఇండియాలో 7.84 కోట్ల రేంజ్ లోనే నెట్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకుంది సినిమా….మినిమమ్ డబుల్ డిజిట్ ఓపెనింగ్స్ ను ఎక్స్ పెర్ట్ చేశారు కానీ అలా జరగలేదు. కానీ సినిమా కి రెస్పాన్స్ సాలిడ్ గా ఉన్న నేపధ్యంలో బాక్స్ ఆఫీస్ దగ్గర..
మొదటి రోజుకి మించి టికెట్ సేల్స్ లో జోరు అయితే కనిపిస్తూ ఉండటంతో ఈ రోజు సినిమా డబుల్ డిజిట్ నెట్ కలెక్షన్స్ ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. అక్షయ్ కుమార్ ఫామ్ లో ఉండి ఉంటే సినిమాకి వచ్చిన టాక్ కి థియేటర్స్ కి జనాలు…
ఓ రేంజ్ లో ఎగబడి వెళ్ళే వాళ్ళు కానీ రీసెంట్ ఫామ్ అనుకున్న రేంజ్ లో లేక పోవడంతో ఆ ఇంపాక్ట్ ఇప్పుడు ఈ సినిమాపై క్లియర్ గానే కనిపిస్తుంది. ఇక సినిమా లాంగ్ రన్ లో మాత్రం మంచి జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.