టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ఖలేజా(Khaleja4K Re Release) సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రీ రిలీజ్ ను సొంతం చేసుకోగా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపే రేంజ్ లో మొదటి రోజు మాస్ రచ్చ చేసింది. ఆల్ మోస్ట్ ఒక కొత్త సినిమా రిలీజ్ టైంలో ఉండే రేంజ్ లో హడావుడి బాక్స్ ఆఫీస్ దగ్గర కనిపించింది…
సినిమా తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ తోనే మాస్ భీభత్సం సృష్టించగా మొదటి రోజు ఎక్స్ లెంట్ హౌస్ ఫుల్ బోర్డులతో అన్ని చోట్లా వీర లెవల్ లో మాస్ కుమ్ముడు కుమేసింది సినిమా…. దాంతో తొలిరోజు ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా తెలుగు రాష్ట్రాల్లో ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తుంటే…
అవలీలగా 5.5-6 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఇక ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను కనుక మించి పొతే ఈ లెక్క మరింత పెరిగే అవకాశం కూడా ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో కూడా రిమార్కబుల్ ట్రెండ్ ను చూపించగా….
ఓవర్సీస్ లో కూడా అన్ని చోట్లా సాలిడ్ జోరునే చూపించింది. నార్త్ అమెరికాలో సాలిడ్ జోరుని చూపించిన ఆస్ట్రేలియా UK అలాగే ఇతర చోట్ల కూడా కుమ్మేసింది. మొత్తం మీద సినిమా వరల్డ్ వైడ్ గా ప్రజెంట్ లెక్కలను బట్టి చూస్తూ ఉంటే మొదటి రోజున…..
వరల్డ్ వైడ్ గా 7.5-8 కోట్ల రేంజ్ కి తగ్గని వసూళ్ళని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు అలాగే ప్రీమియర్స్ ఫైనల్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండొచ్చు. ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర రిమార్కబుల్ జోరు ని చూపించిన ఖలేజా సినిమా…
టాలీవుడ్ రీ రిలీజ్ లలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ నుండి అన్నీ అనుకున్నట్లు జరిగితే ది బెస్ట్ ఓపెనర్ గా మాస్ భీభత్సం సృష్టించే అవకాశం ఎంతైనా ఉంది. ఇక అఫీషియల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజున సాధించే కలెక్షన్స్ భీభత్సం ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి ఇప్పుడు…