ఆల్ మోస్ట్ కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఉండే రేంజ్ లో యుఫోరియాతో ఓపెన్ అయింది టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ఖలేజా(Khaleja4K Re Release) సినిమా వరల్డ్ వైడ్ గా… 2010 టైంలో అనుకున్న రేంజ్ లో అంచనాలను అందుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ రిజల్ట్ ను…
సొంతం చేసుకున్న ఈ సినిమా తర్వాత టైంలో టెలివిజన్ లో కల్ట్ స్టేటస్ ను సొంతం చేసుకోగా ఆ ఇంపాక్ట్ ఇప్పుడు రీ రిలీజ్ లో క్లియర్ గా కనిపిస్తుంది. అన్ని చోట్లా సెన్సేషనల్ ఓపెనింగ్స్ తో మాస్ రచ్చ చేసిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ అండ్ డే 1…
కలెక్షన్స్ పరంగా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టు ది బిగ్గెస్ట్ డే 1 కలెక్షన్స్ ని నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉంది. ఇక ఓవర్సీస్ లో ప్రీమియర్స్ తో 52 వేల డాలర్స్ మార్క్ ని నార్త్ అమెరికాలో అందుకోగా ఆస్ట్రేలియా అండ్ UK లో కూడా ఎక్స్ లెంట్ గా ట్రెండ్ ను చూపెడుతూ..
మాస్ రచ్చ చేస్తూ ఉండగా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల థియేటర్స్ లో హౌస్ ఫుల్ బోర్డులతో ఓపెన్ అయిన సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోల ట్రెండ్ కూడా బుకింగ్స్ లో సూపర్ సాలిడ్ గా ఉండటంతో ఓవరాల్ గా మొదటి రోజున…
ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తుంటే అవలీలగా 5 కోట్లు ఆ పైన గ్రాస్ ను అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది…ఈవినింగ్ అండ్ నైట్ షోల జోరుని బట్టి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అండ్ ఓవర్సీస్ ఫైనల్ బుకింగ్స్ ను బట్టి లెక్క ఎంతవరకు వెళుతుందో చూడాలి…
ఓవరాల్ గా 15 ఏళ్ల క్రితం డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న సినిమా తో ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ ఊచకోత కోస్తూ సంచలనం సృష్టిస్తూ దుమ్ము లేపుతూ ఉండటం విశేషమని చెప్పాలి. ఇక డే 1 కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి.