బాక్స్ ఆఫీస్ దగ్గర యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటించిన లేటెస్ట్ మూవీ ఖుషి(Kushi 2023) సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకోగా ఓపెనింగ్స్ పరంగా కూడా కుమ్మేస్తూ దూసుకు పోతూ ఉంది…
విజయ్ దేవరకొండ లాస్ట్ మూవీ లైగర్(Liger) తో పోల్చితే ఓవరాల్ గా మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలు 15-20% వరకు తక్కువ బుకింగ్స్ స్టేటస్ ఉండగా మాస్ సెంటర్స్ లో లైగర్ బుకింగ్స్ ఎక్కువగా జరిగాయి… కానీ లైగర్ టాక్ నెగటివ్ అవ్వడంతో….
తర్వాత స్లో అయిపోగా… ఇక్కడ ఖుషి మాత్రం షో షోకి మంచి ఆక్యుపెన్సీతో గ్రోత్ ని చూపెడుతూ దూసుకు పోతుంది. కానీ మాస్ సెంటర్స్ లో మాత్రం లైగర్ కన్నా వెనకే ఉంది ఖుషి సినిమా… దాంతో ట్రాక్ చేసిన సెంటర్స్ ను అలాగే సినిమా షో షోకి చూపిస్తున్న గ్రోత్ ని బట్టి…
మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 8.5-9 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుంటే 10 కోట్ల మార్క్ ని అందుకోవచ్చు. ఇక ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించిపోతే ఇంకా ఎక్కువ వసూళ్లు సొంతం చేసుకోవచ్చు…
ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 13-14 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ లెక్కలు టోటల్ ఓవర్సీస్ రిపోర్ట్ ను బట్టి ఈ లెక్క ఇంకా పెరగవచ్చు. ఓవరాల్ గా సినిమా మొదటి రోజు సాలిడ్ స్టార్ట్ ను సొంతం చేసుకుంది. ఇక ఫస్ట్ డే కలెక్షన్స్ ఈ అంచనాలను మించిపోతాయో లేక ఇదే రేంజ్ లో ఉంటాయో చూడాలి.