Home న్యూస్ 1st DAY కుబేర ఓపెనింగ్స్….బాక్స్ ఆఫీస్ మాస్ రచ్చ శురూ!!

1st DAY కుబేర ఓపెనింగ్స్….బాక్స్ ఆఫీస్ మాస్ రచ్చ శురూ!!

0

రెండు రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయినా కూడా అనుకున్న రేంజ్ లో బుకింగ్స్ లేక పోవడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర కింగ్ నాగార్జున(Akkineni Nagarjuna) ధనుష్(Dhanush)  కుబేర(Kuberaa Movie) సినిమా ఎలాంటి ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంటుందో అన్న అనుమానాలు అందరిలో కలిగినా కూడా…

రిలీజ్ రోజున అల్టిమేట్ పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న కుబేర సినిమా అన్ని చోట్లా అద్బుతమైన ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంటూ మాస్ రచ్చ చేస్తూ ఉంది. తమిళ్ లో బుకింగ్స్ తెలుగు లో కన్నా వీక్ గా స్టార్ట్ అయినా కూడా సూపర్ పాజిటివ్ టాక్ హెల్ప్ తో..

షో షోకి కలెక్షన్స్ పరంగా మంచి జోరుని చూపెడుతూ దూసుకు పోతున్న సినిమా ఫస్ట్ డే ఈవినింగ్ అండ్ నైట్ షోలకు మరింత రచ్చ లేపే అవకాశం ఎంతైనా ఉంది…ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాల్లో సినిమా 4-5 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను..

అందుకునే అవకాశం ఉండగా ఆఫ్ లైన్ లెక్కలు ఈవినింగ్ అండ్ నైట్ షోల ట్రెండ్ సాలిడ్ గా ఉంటే ఈ లెక్క మరింత మించే అవకాశం ఉంది. ఇక తమిళనాడు లో సినిమా ఓపెనింగ్స్ వీక్ గా ఉన్నా ఇప్పుడు షో షోకి మంచి జోరుని చూపెడుతూ ఉండగా…

అక్కడ 5 కోట్ల రేంజ్ దాకా వెళ్ళే అవకాశం ఉంది, ఓవర్సీస్ లో హాల్ఫ్ మిలియన్ ను దాటేసి మిలియన్ మార్క్ వైపు పరుగులు పెడుతున్న సినిమా మొత్తం మీద వరల్డ్ వైడ్ గా మొదటి రోజున 18-20 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను టార్గెట్ చేసిందని చెప్పాలి.

ఈవినింగ్ అండ్ నైట్ షోల ట్రెండ్ అనుకున్న రేంజ్ లో సాగితే మొదటి రోజు ఈ అంచనాలను సైతం సినిమా మించే అవకాశం ఉంటుంది, వీకెండ్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కచ్చితంగా సాలిడ్ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here