బాక్స్ ఆఫీస్ దగ్గర యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ లైగర్ ఆడియన్స్ ముందుకు భారీ లెవల్ లో రిలీజ్ అవ్వగా సినిమా పై ఉన్న అంచనాల వలన 4 రోజుల ముందు నుండే ఎక్స్ లెంట్ బుకింగ్స్ జరిగాయి. ఇక సినిమా రిలీజ్ అయిన రోజున ఓవరాల్ గా మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల టైం కి ఓవరాల్ గా అన్ని చోట్లా యావరేజ్ గా 60-65% రేంజ్ లో ఆక్యుపెన్సీతో రన్ అయింది.
ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోలకి వచ్చే సరికి ఉన్నంతలో మంచి హోల్డ్ నే చూపించింది. మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో సినిమా ఇప్పుడు మీడియం రేంజ్ హీరోలలో రికార్డ్ కలెక్షన్స్ ని ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపడానికి సిద్ధం అవుతూ ఉండగా…
ఓవర్సీస్ ప్రీమియర్స్ ద్వారా $476K డాలర్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపగా డే 1 కలెక్షన్స్ తో సినిమా 650K రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకునే అవకాశం మించిపోయే అవకాశం ఉండగా హిందీలో ప్రీమియర్స్ మాత్రమె పడ్డ ఈ సినిమా అక్కడ 1.5-2 కోట్ల రేంజ్ లో…
నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 12-13 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుండి హైర్స్ కూడా యాడ్ అయితే ఇంకా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది… మొత్తం మీద సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా…
సినిమా 17-18 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది, ఫైనల్ లెక్కలను బట్టి ఈ కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా వెళ్ళే అవకాశం ఉంది, మిక్సుడ్ రెస్పాన్స్ తో కొన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పై ఎఫెక్ట్ ఉంది, ఆ ఎఫెక్ట్ ని బట్టి మొత్తం మీద ఫస్ట్ డే కలెక్షన్స్ ఈ రేంజ్ లో ఉంటాయా లేక మించిపోతుందో చూడాలి. మొత్తం మీద మాత్రం మీడియం రేంజ్ హీరోల్లో ఇది ఆల్ టైం రికార్డ్ ఓపెనింగ్స్ అని చెప్పాలి ఇప్పుడు….