Home న్యూస్ 1st Day మ్యాడ్2 కలెక్షన్స్….మెంటల్ మాస్ జాతర ఇది!!

1st Day మ్యాడ్2 కలెక్షన్స్….మెంటల్ మాస్ జాతర ఇది!!

0

ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు చాలానే సినిమాలు రిలీజ్ అవ్వగా వాటిలో అందరి అంచనాలను అందుకుంటూ మాస్ రచ్చ చేస్తున్న మ్యాడ్(Mad Movie) కి సీక్వెల్ గా వచ్చిన మ్యాడ్ స్క్వేర్(Mad Square Movie) రిమార్కబుల్ ఓపెనింగ్స్ తో మాస్ కుమ్ముడు కుమ్మేస్తూ ఉండగా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా…

అనుకున్న అంచనాలను మించి జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉంది. మిగిలిన సినిమాలను అన్నింటినీ కూడా ఫుల్లుగా డామినేట్ చేస్తూ దూసుకు పోతున్న సినిమా ఫస్ట్ డే ఓవరాల్ గా బిజినెస్ లో చాలా మొత్తాన్ని రికవరీ చేసే అవకాశం ఇప్పుడు ఎంతైనా ఉందని చెప్పాలి.

ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే ఫస్ట్ డే సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు 5-5.5 కోట్ల రేంజ్ లో షేర్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు కనుక అంచనాలను మించి పోతే ఈ కలెక్షన్స్ ని కూడా సినిమా…

దాటేసే అవకాశం ఎంతైనా ఉంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో కూడా మాస్ కుమ్ముడు కుమ్మేస్తున్న సినిమా వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 7.5 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ మార్క్ ని అందుకునే ఛాన్స్ కనిపిస్తుంది…

ఫైనల్ లెక్కలు కనుక అంచనాలను మించిపోతే ఈ లెక్క ఇంకా పెరిగే ఔట్ రైట్ ఛాన్స్ కూడా సినిమా కి ఉంది. ఓవరాల్ గా బిజినెస్ లో చాలా మొత్తాన్ని మొదటి రోజే రికవరీ చేస్తున్న సినిమా లాంగ్ వీకెండ్ లో సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపడం ఖాయం. ఇక ఫస్ట్ డే అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here