బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు టాలీవుడ్ లో చాలానే సినిమాలు రిలీజ్ అవ్వగా వాటిలో మంచి హైప్ నడుమ రిలీజ్ అయిన మ్యాడ్(Mad Movie) కి సీక్వెల్ గా వచ్చిన మ్యాడ్ స్క్వేర్(Mad Square Movie) హైప్ కి ఏమాత్రం తీసిపోని రేంజ్ లో మాస్ ఓపెనింగ్స్ తో అన్ని చోట్లా మాస్ కుమ్ముడు కుమ్మేస్తుంది.
ఓవర్సీస్ లో ప్రీమియర్స్ తోనే దుమ్ము దుమారం లేపిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో అన్ని సినిమాలను ఫుల్లుగా డామినేట్ చేస్తూ ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ తో ఊచకోత కోస్తూ ఉండగా…టాక్ పర్వాలేదు అనిపించేలా ఉండటంతో ఓపెనింగ్స్ పరంగా అన్ని చోట్లా సెన్సేషనల్ స్టార్ట్ ను…
సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న సినిమా ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే డబుల్ డిజిట్ గ్రాస్ మార్క్ ని అవలీలగా దాటేయడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా అవలీలగా ఇప్పుడు 3.6-4 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను…
సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా, ఈవినింగ్ అండ్ నైట్ షోలకు ట్రెండ్ ఇలానే జోరు కొనసాగిస్తే ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక ఓవర్సీస్ లో కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా లో కూడా ఉన్న షోలలో మంచి జోరుని చూపెడుతున్న సినిమా…
6 కోట్లకు పైగానే షేర్ ని అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ గా ఈవినింగ్ అండ్ నైట్ షోల ట్రెండ్ ను బట్టి కలెక్షన్స్ లెక్క ఇంకా ఎంతవరకు వెళుతుంది అన్నది చెప్పగలం. ఓవరాల్ గా భారీ పోటిలో వార్ వన్ సైడ్ చేస్తూ ఊచకోత కోస్తున్న ఈ సినిమా డే ని ఎలాంటి కలెక్షన్స్ తో ముగిస్తుందో చూడాలి ఇప్పుడు.