బాక్స్ ఆఫీస్ దగ్గర 12 ఏళ్ల క్రితం రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఆడియన్స్ ముందుకు ఎన్నో ఏళ్ల డిలే తర్వాత ఎట్టకేలకు ఇప్పుడు 12 ఏళ్ల తర్వాత తమిళ్ లో సంక్రాంతికి రిలీజ్ అయ్యింది. విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ మద గజ రాజ సినిమా మంచి జోరుని చూపించి తమిళ్ లో ఏకంగా 50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ తో దుమ్ము లేపే హిట్ గా నిలిచింది.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో రీసెంట్ గా డబ్ అయ్యి రిలీజ్ అవ్వగా ఇక్కడ సినిమాకి మాస్ సెంటర్స్ లో పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ సొంతం అవ్వగా ఓపెనింగ్స్ పరంగా మరీ అనుకున్న రేంజ్ లో ఇంపాక్ట్ అయితే చూపించలేదు.
తొలిరోజు ఓవరాల్ గా ట్రాక్ చేసిన సెంటర్స్ అలాగే ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ఎస్టిమేషన్స్ కలిపి ఓవరాల్ గా సినిమా 40 లక్షల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. షేర్ కొంచం అటూ ఇటూగా 20 లక్షల దాకా ఉంటుందని అంచనా…ఓవరాల్ గా సినిమా తెలుగు లో డీసెంట్ 2.2 కోట్ల రేంజ్ లో.
షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా తొలిరోజు సినిమా బిలో పార్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. కానీ ఈ వీకెండ్ రిలీజ్ అయిన మూవీస్ లో ఎంతో కొంత బెటర్ కలెక్షన్స్ ని 12 ఏళ్ల క్రితం రిలీజ్ అవ్వాల్సిన మద గజ రాజ సినిమా సోనం చేసుకోవడం విశేషం అనే చెప్పాలి.
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా వీకెండ్ లో పర్వాలేదు అనిపించేలా ట్రెండ్ ను చూపించే అవకాశం ఉండగా తమిళ్ రేంజ్ లో సినిమా తెలుగు లో జోరు చూపించడం కష్టమే అయినా కూడా సినిమా వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తుందో చూడాలి ఇక…