బాక్స్ ఆఫీస్ దగ్గర సందీప్ కిషన్(Sundeep Kishan) నటించిన లేటెస్ట్ మూవీ మజాకా(Mazaka Movie) రీసెంట్ గా రిలీజ్ ఆయ్యి ఆడియన్స్ నుండి డీసెంట్ ఎంటర్ టైనర్ అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా ఓపెనింగ్స్ పరంగా సినిమా డీసెంట్ టు గుడ్ ఓపెనింగ్స్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటూ ఉండగా…
ఈవినింగ్ అండ్ నైట్ షోల ట్రెండ్ కూడా స్టడీగానే ఉండగా ఓవరాల్ గా సినిమా రీసెంట్ టైంలో సందీప్ కిషన్ మూవీస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఓపెనింగ్స్ అందుకునే దిశగా పరుగును కొనసాగిస్తూ ఉండగా ఓవరాల్ గా సినిమా… ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే….
తెలుగు రాష్ట్రాల్లో 80 లక్షల రేంజ్ నుండి 1 కోటి రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు కనుక బాగుంటే షేర్ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉండగా, ఓవర్సీస్ లో పర్వాలేదు అనిపించేలా ఓపెన్ అయిన సినిమా…
కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా లో కూడా ఓకే అనిపించే రేంజ్ లో ఓపెన్ అవ్వగా మొత్తం మీద మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 1.2-1.4 కోట్ల రేంజ్ లో షేర్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు కనుక బాగుంటే షేర్ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంది.
ఓవరాల్ గా పండగ అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ సినిమా అనుకున్న రేంజ్ లో గ్రోత్ ని చూపించ లేదు కానీ రిపోర్ట్ లు మాస్ సెంటర్స్ లో ఆక్యుపెన్సీ పర్వాలేదు అనిపించేలానే ఉండటంతో ఓవరాల్ గా కలెక్షన్స్ ఇంకొంచం పెరిగే అవకాశం ఉంది. ఇక డే 1 అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.