మహా శివరాత్రి కానుకగా ఆడియన్స్ ముందుకు గ్రాండ్ గా రిలీజ్ అయిన సందీప్ కిషన్(Sundeep Kishan) నటించిన లేటెస్ట్ మూవీ మజాకా(Mazaka Movie) సినిమా డీసెంట్ రిపోర్ట్ లను సొంతం చేసుకోగా ఆన్ లైన్ లో కొంచం మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకున్న కూడా ఆఫ్ లైన్ లో మాత్రం సినిమా కి టాక్..
బెటర్ గా ఉండగా పండగ హాలిడే రోజున సినిమా ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది కానీ కలెక్షన్స్ పరంగా ఇంకా జోరు చూపించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఉన్నంతలో సినిమా ట్రాక్ చేసిన సెంటర్స్ లో 1.75 కోట్ల గ్రాస్ ను అందుకోగా…
ఓవరాల్ గా మొదటి రోజున సినిమా 2.15 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా షేర్ పరంగా సినిమా 1.25 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో సినిమా 75 లక్షల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకున్న సినిమా…
ఓవరాల్ గా షేర్ 35 లక్షల రేంజ్ లో సొంతం చేసుకున్న సినిమా టోటల్ గా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 1.60 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా 2.90 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా అందుకుంది. సినిమా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 11.5 కోట్ల దాకా ఉండగా…
మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 10 కోట్ల లోపు షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. సినిమా ఇక ఈ వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ చేసి ఈ టార్గెట్ ను ఎంతవరకు అందుకునే ప్రయత్నం చేస్తుందో చూడాలి ఇప్పుడు.