Home న్యూస్ మహేష్ బాబు మాస్ పవర్….ముఫాసా 1st డే మాస్ కలెక్షన్స్!!

మహేష్ బాబు మాస్ పవర్….ముఫాసా 1st డే మాస్ కలెక్షన్స్!!

0

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) వాయిస్ ఓవర్ ఇచ్చిన హాలీవుడ్ మూవీ ముఫాసా ది లయన్ కింగ్ సినిమా(Mufasa The Lion King) సినిమా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాకి ఓవరాల్ గా ఆడియన్స్ నుండి మరీ అనుకున్న రేంజ్ లో రెస్పాన్స్ రాకున్నా కూడా తెలుగు లో మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడంతో..

ఇక్కడ ఊహించని రేంజ్ లో ఆక్యుపెన్సీని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది. మొదటి రోజు ఇండియాలో సినిమా 9 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమా సౌత్ వర్షన్ లు బాగానే పెర్ఫార్మ్ చేసినా కూడా ఓవరాల్ గా తెలుగు ఆడియన్స్ నుండి మాత్రం…

అనుకున్న దాని కన్నా కూడా బెటర్ గా ట్రెండ్ ను చూపించి మాస్ రచ్చ చేసింది. ట్రాక్ చేసిన సెంటర్స్ లోనే 1.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకున్న సినిమా మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 1.75 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా…

హాలీవుడ్ వర్షన్ తో కలిపి 2 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని కుమ్మేసింది. మహేష్ బాబు స్టార్ పవర్ హెల్ప్ తో ఫ్యాన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా తెలుగు డబ్ వర్షన్ ను ఎగబడి చూశారు మొదటి రోజున…ఇక రెండో రోజు బుకింగ్స్ ట్రెండ్ కూడా బాగానే ఉండటంతో…

రెండో రోజు కూడా సినిమా మంచి కలెక్షన్స్ ని ఇక్కడ సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది. మిగిలిన వర్షన్ లు ఎలా ఉన్నా కూడా తెలుగు వర్షన్ మాత్రం మహేష్ బాబు స్టార్ పవర్ హెల్ప్ తో బాగానే కుమ్మేస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here