బాక్స్ అఫీస్ దగ్గర కోలివుడ్ టాప్ హీరోలలో ఒకరైన తల అజిత్ కుమార్(Ajith Kumar) నటించిన లేటెస్ట్ మూవీ విదాముయర్చి (Vidaamuyarchi) మూవీ తెలుగు లో పట్టుదల(Pattudala) పేరుతో డబ్ అయ్యి రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తమిళ్ లో బజ్ తక్కువ ఉన్నా ఎక్స్ లెంట్ బుకింగ్స్ తో కుమ్మేసింది.
తెలుగులో పెద్దగా ఇంపాక్ట్ ను చూపించ లేక పోయిన సినిమా మిక్సుడ్ టాక్ ఇంపాక్ట్ వలన పెద్దగా హోల్డ్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించ లేక పోయింది. ఉన్నంతలో బుకింగ్స్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా 50 లక్షల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను…
సొంతం చేసుకునే అవకాశం ఉండగా, ఫైనల్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ కొంచం పెరిగే అవకాశం ఉంది. ఇక తమిళనాడులో మాత్రం సినిమా ఎక్స్ లెంట్ అడ్వాన్స్ బుకింగ్స్ ను సొంతం చేసుకోగా మొదటి రోజు ట్రెండ్ కూడా సాలిడ్ గానే ఉంది…
ఈవినింగ్ షోలకు కొంచం డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా కూడా ఓవరాల్ గా మొదటి రోజు తమిళనాడులో 18-20 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు మాస్ సెంటర్స్ లో కుమ్మేస్తే ఓవరాల్ గా లెక్క…
20-22 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం ఉందని చెప్పాలి. ఇక కర్ణాటక, కేరళ ఓవరాల్ గా రెస్ట్ ఆఫ్ ఇండియా లో సినిమా 6-7 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం ఉండగా, ఓవర్సీస్ లో సినిమా 2 మిలియన్ మార్క్ కి అటూ ఇటూగా ఉండే అవకాశం ఉండటంతో…
వరల్డ్ వైడ్ గా సినిమా మొదటి రోజు 46-50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే సినిమా కలెక్షన్స్ ఇంకొంచం పెరిగే అవకాశం ఉంది, మొత్తం మీద ఆఫ్ బీట్ మూవీతో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మంచి ఓపెనింగ్స్ నే సొంతం చేసుకుందని చెప్పాలి. ఇక ఫస్ట్ డే అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.