బాక్స్ ఆఫీస్ దగ్గర ఐకాన్ స్టార్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) సుకుమార్ ల క్రేజీ కాంబోలో ఆడియన్స్ ముందుకు భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన పుష్ప2(Pushpa 2 The Rule 1st Day Collections) సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ లెవల్ లో రిలీజ్ ను సొంతం చేసుకుని ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది ఇప్పుడు…
ఇక ఓపెనింగ్స్ పరంగా అల్టిమేట్ ఓపెనింగ్స్ తో అన్ని చోట్లా మాస్ రాంపెజ్ ను చూపెడుతూ దూసుకు పోతున్న సినిమా తొలిరోజు ఇప్పుడు రికార్డుల జాతర సృష్టించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి….తెలుగు రాష్ట్రాల్లో సినిమా అన్ని ఏరియాల్లో ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను నమోదు చేసింది…
టికెట్ హైక్స్ మరీ ఎక్కువగా ఉండటంతో అనుకున్న రేంజ్ లో ఫుల్స్ పడలేదు కానీ ఓవరాల్ గా చూసుకుంటే భారీ టికెట్ హైక్స్ హెల్ప్ వలన రికార్డ్ నంబర్స్ ను ఇప్పుడు సినిమా నమోదు చేయబోతుంది. తెలుగు రాష్ట్రాల నుండి సినిమా మొదటి రోజు ఓవరాల్ గా….
65-68 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను మొదటి రోజు సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండొచ్చు….ఇక హిందీలో సినిమా రిపోర్ట్ అయిన సెంటర్స్ ను బట్టి 64-66 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని…
అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. ఇక కర్ణాటకలో మొదటి రోజు 7 కోట్ల రేంజ్ లో షేర్ ని తమిళ్ మరియు కేరళలో సినిమా ఓవరాల్ గా 7-8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా…. టోటల్ గా ఇండియాలో…
సినిమా మొదటి రోజున ఇప్పుడు 106-110 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది, ఇక ఓవర్సీస్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 7-7.5 మిలియన్ డాలర్స్ ను అందుకునే అవకాశం ఉండగా అక్కడ నుండి షేర్ అటూ ఇటూగా 30-32 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం ఉంది…
దాంతో మొదటి రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా ఇప్పుడు 135-140 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది. ఇదంతా ప్రస్తుతం ఉన్న అంచనాలను బట్టి కలెక్షన్స్ కాగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు ఎక్స్ లెంట్ గా ఉండి…
సినిమా అంచనాలను మించిపొతే ఓవరాల్ షేర్ లెక్క ఈ ఎక్స్ పెర్టేషన్స్ ను మించి పోయే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మరి మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ అంచనాలను మించి ఏ రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ భీభత్సం సృష్టిస్తుందో చూడాలి ఇప్పుడు….
Weekend daaka Baga aduddi daani tharvatha 🤣🤣🤣nee thumbnail be like endhi Swami idi endhi shikaram nundi nelapaik ,chukkalu kanipicchayi Ila untadi ……..