వరల్డ్ వైడ్ గా అత్యంత భారీ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు వచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule Movie) సినిమా, ఆల్ రెడీ ఓవర్సీస్ ప్రీమియర్స్ తో మాస్ రచ్చ చేసింది…ఇండియాలో స్పెషల్ ప్రీమియర్స్ తో ఓ రేంజ్ లో వసూళ్ళ భీభత్సం సృష్టించింది…
ఇక ఓవరాల్ గా రిలీజ్ కి ముందు రోజు వరకు ఓవరాల్ గా అడ్వాన్స్ గ్రాస్ లెక్క 150 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది…ఇక మొదటి రోజు సినిమా రిమార్కబుల్ ఓపెనింగ్స్ తో అన్ని చోట్లా కుమ్మేస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం…
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే సినిమా నైజాంలో ఎక్స్ లెంట్ స్టార్ట్ ను సొంతం చేసుకోగా భారీ టికెట్ హైక్స్ వలన ఫుల్స్ అనుకున్న రేంజ్ లో పడక పోయినా కూడా ఆక్యుపెన్సీ సాలిడ్ గానే ఉంది. ఇక సీడెడ్ లో దుమ్ము లేపే రేంజ్ లో ఓపెనింగ్స్ తో సినిమా దూసుకు పోతుంది…
ఆంధ్రలో కూడా కుమ్మేస్తున్న సినిమా ఊపు చూస్తుంటే మొదటి రోజు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో 60 కోట్ల రేంజ్ లో షేర్ ఓపెనింగ్స్ మినిమమ్ వచ్చే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు ఈవినింగ్ అండ్ నైట్ షోలకు సినిమా చూపించే జోరు ని బట్టి…
కలెక్షన్స్ లెక్క 65-70 కోట్ల రేంజ్ కి వెళ్ళే అవకాశం ఉంది, ఇక హిందీలో సినిమా ఎక్స్ లెంట్ స్టార్ట్ ను సొంతం చేసుకోగా తమిళ్ కేరళలో పరవాలేదు అనిపించేలా, కర్ణాటకలో ఎక్స్ లెంట్ స్టార్ట్ ను సొంతం చేసుకుంది… ఇక ఓవర్సీస్ లో కూడా ఓవరాల్ గా కుమ్మేస్తున్న సినిమా…
మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 120 కోట్లకు పైగా షేర్ ఓపెనింగ్స్ ని మినిమమ్ వసూల్ చేయడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా, ఈవినింగ్ అండ్ నైట్ షోల జోరు ను బట్టి 130-135 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు…అంతకన్నా మించి వెళితే మట్టుకు అది ఇక భీభత్సమనే చెప్పాలి. ఇక డే ఎండ్ టైంకి సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి…