Home న్యూస్ రాయన్ 1st డే కలెక్షన్స్…..ధనుష్ ఊరమాస్ రాంపెజ్!

రాయన్ 1st డే కలెక్షన్స్…..ధనుష్ ఊరమాస్ రాంపెజ్!

0
Dhanush Raayan Movie 1st Day Box Office Collections Report
Dhanush Raayan Movie 1st Day Box Office Collections Report

బాక్స్ ఆఫీస్ దగ్గర కోలివుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) కెరీర్ లో ప్రతిష్టాత్మక 50వ సినిమాగా రూపొందిన లేటెస్ట్ మూవీ రాయన్(Raayan Movie 1st Day Collections) సినిమా భారీ లెవల్ లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యి పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. సినిమా మాస్ ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకోగా…

మిగిలిన సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ నుండి పర్వాలేదు అనిపించే లెవల్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ యావరేజ్ లెవల్ లో ఉండగా మాస్ సెంటర్స్ లో పర్వాలేదు అనిపించగా మిగిలిన చోట్ల ఓకే అనిపించే ఓపెనింగ్స్ ను అందుకోగా…

మొత్తం మీద ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి రేంజ్ నుండి 1.2 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 1.5 కోట్ల దాకా వెళ్ళొచ్చు. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా…

తమిళ్ లో ఎక్స్ లెంట్ గా ట్రెండ్ ను చూపెడుతూ దూసుకు పోతూ ఉండగా తొలిరోజు అవలీలగా 10 కోట్లకు పైగానే గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం కనిపిస్తుంది. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉంది…

ఇక కర్ణాటకలో ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను అందుకున్న సినిమా కేరళ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో పర్వాలేదు అనిపించగా ఓవర్సీస్ లో కూడా సినిమా మంచి స్టార్ట్ ను సొంతం చేసుకోబోతుండగా మొత్తం మీద సినిమా ఇప్పుడు మొదటి వరల్డ్ వైడ్ గా…

అటూ ఇటూగా 16-18 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా మొదటి రోజు ధనుష్ మాస్ రాంపెజ్ ను చూపెట్టిన రాయన్ ఇక అఫీషియల్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here