మాస్ మహారాజ్ రవితేజ లేటెస్ట్ మూవీ రావణాసుర సినిమా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా ప్రీమియర్స్ తో మొత్తం మీద 20 వేల రేంజ్ డాలర్స్ ను సొంతం చేసుకోగా తెలుగు రాష్ట్రాల నుండే ఎక్కువ వసూళ్లు సాధించాల్సిన అవసరం ఉండగా సినిమా ఓవరాల్ గా డీసెంట్ ఓపెనింగ్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు సొంతం చేసుకుందని చెప్పాలి ఇప్పుడు…రవితేజ రీసెంట్ మూవీస్ లో ధమాకా మూవీ తో…
పోల్చితే రావణాసుర సినిమా ఓవరాల్ గా ట్రాక్ చేసిన సెంటర్స్ లో 15-20% వరకు బుకింగ్స్ తక్కువగా ఉన్నాయి. కానీ అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను ట్రాక్ చేయలేం కాబట్టి మొత్తం మీద సినిమా ధమాకా మరియు క్రాక్ సినిమాలను పక్కకు పెడితే…
ఇతర రవితేజ సినిమాల రేంజ్ లోనే ఓపెనింగ్స్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. అటూ ఇటూగా 3.2 కోట్ల రేంజ్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెన్ అయ్యే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ 3.5 కోట్ల నుండి 3.8 కోట్ల దాకా వెళ్ళొచ్చు…
వరల్డ్ వైడ్ గా సినిమా 4.5 కోట్ల రేంజ్ లో ఓపెన్ అయ్యే అవకాశం ఉంది, ఓవరాల్ గా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి ఈ కలెక్షన్స్ అటూ ఇటూగా ఉండే అవకాశం ఉంది, ధమాకా మూవీ ఓపెనింగ్ డే కలెక్షన్స్ పరంగా అంచనాలను మించింది, మరి రావణాసుర కూడా అంచనాలను మించుతుందో లేదో చూడాలి ఇప్పుడు.