కోలివుడ్ స్టార్ హీరోలలో ఒకరైన సూర్య(Suriya) నటించిన లేటెస్ట్ మూవీ రెట్రో(Retro Movie)సినిమా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాకి ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ సొంతం కాగా మిగిలిన ఆడియన్స్ నుండి కొంచం మిక్సుడ్ రెస్పాన్స్ ఉన్నప్పటికీ అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం అదిరిపోయే రేంజ్ లో ఉండగా…
రిలీజ్ కి ముందు రోజు వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ ఓవరాల్ గా 15 కోట్ల మార్క్ ని అందుకోగా మొదటి రోజు తమిళనాడులో సూర్య ప్రీవియస్ మూవీ కంగువ కన్నా కూడా బెటర్ ట్రెండ్ ను చూపిస్తూ ఉండగా మిగిలిన చోట్ల మాత్రం ఇంపాక్ట్ ఉంది…
సినిమా తెలుగు రాష్ట్రాల్లో హిట్3 మూవీ ఇంపాక్ట్ వలన అనుకున్న రేంజ్ లో ఆక్యుపెన్సీ లేదు, ఉన్నంతలో ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా 2 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ మార్క్ ని అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు…
బాగుంటే కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక సినిమా తమిళనాడులో ప్రజెంట్ ట్రెండ్ చూస్తుంటే 12-14 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే 16 కోట్ల దాకా వెళ్ళే ఔట్ రైట్ ఛాన్స్ ఉంది.
కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో కూడా మంచి ఓపెనింగ్స్ నే అందుకున్నా ఓవరాల్ గా ట్రెండ్ కొంచం కంగువ కన్నా తక్కువగానే ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే మొదటి రోజున వరల్డ్ వైడ్ గా ఇప్పుడు..
30 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉండగా, తమిళనాడు మరియు ఓవర్సీస్ లో ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించిపొతే ఈ లెక్క పెరగవచ్చు. మరి సినిమా ఫస్ట్ డే అఫీషియల్ గా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి ఇప్పుడు.