బాక్స్ అఫీస్ దగ్గర భారీ బడ్జెట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన యూత్ స్టార్ నితిన్(Nithiin) నటించిన లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్(RobinHood Movie) సినిమా సాలిడ్ ప్రమోషన్స్ ను జరుపుకుని రిలీజ్ అయింది కానీ, భారీ పోటిలో రిలీజ్ అవ్వడంతో ఆడియన్స్ నుండి రెస్పాన్స్ మరీ అనుకున్న రేంజ్ లో అయితే సొంతం చేసుకోలేక పోయింది.
తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయిన మూవీస్ లో భారీ బడ్జెట్ తో వచ్చిన రాబిన్ హుడ్ ఆన్ లైన్ అండ్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు సినిమా రేంజ్ కి ఏమాత్రం సింక్ లేకుండా ఉండటం అందరినీ ఆశ్యర్యపరుస్తుంది అని చెప్పాలి ఇప్పుడు…
ఒక రోజు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా రెస్పాన్స్ యావరేజ్ గా ఉండగా మౌత్ టాక్ నే నమ్ముకుని రిలీజ్ అయిన సినిమా కి ఉన్నంతలో టాక్ పర్వాలేదు అనిపించేలా ఉన్నప్పటికీ కూడా కలెక్షన్స్ పరంగా మాత్రం ఓపెనింగ్స్ పెద్దగా ఇంపాక్ట్ కనిపించలేదు…
ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తుంటే మొదటి రోజున సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే 1.6-1.8 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉంది.
ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 2.5-2.8 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా, దానికి కూడా ఓవరాల్ గా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో మంచి జోరు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.
మొత్తం మీద రాబిన్ హుడ్ మూవీ తో నితిన్ మంచి కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడు అనుకున్నా కూడా ఓపెనింగ్స్ విషయంలో ఆ ఇంపాక్ట్ కనిపించడం లేదు…కానీ లాంగ్ వీకెండ్ ఉండటంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతో కొంత జోరు చూపించి కలెక్షన్స్ ని దక్కించుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఇక ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.