బాక్స్ ఆఫీస్ దగ్గర నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం (SARIPODHAA SANIVAARAM Movie Box Office Collections) సినిమా రీసెంట్ గా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవ్వగా ఓవర్సీస్ ప్రీమియర్స్ తో ఎక్స్ లెంట్ స్టార్ట్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కూడా…
మొదటి రోజు మాస్ రచ్చ చేసింది అని చెప్పాలి ఇప్పుడు. సినిమా ఓపెన్ అవ్వడం 30-35% రేంజ్ లో ఆక్యుపెన్సీతో ఓపెన్ అవ్వగా తర్వాత పాజిటివ్ టాక్ ఇంపాక్ట్ వలన షో షోకి గ్రోత్ ని చూపెడుతూ మ్యాట్నీ షోల టైంకి 45-50% రేంజ్ లో ఆక్యుపెన్సీతో రన్ అవ్వగా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు…
వచ్చేసరికి మరింత గ్రోత్ ని చూపెడుతూ దూసుకు పోతుంది. వర్కింగ్ డే ఇంపాక్ట్ ఉన్నా కూడా ఓవరాల్ గా మొదటి రోజు సినిమా ఎక్స్ లెంట్ స్టార్ట్ నే సొంతం చేసుకోబోతుంది కానీ ఓవరాల్ గా నాని కెరీర్ బెస్ట్ మూవీ దసరా తో పోల్చితే బుకింగ్స్ రేంజ్ ఆ లెవల్ లో లేదనే చెప్పాలి..
మొత్తం మీద ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే ముందు అనుకున్నట్లే సినిమా 6కోట్ల రేంజ్ లో షేర్ ని ఓపెనింగ్స్ లో సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది…ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కూడా బాగానే జోరుగా సాగుతున్నాయి కానీ మరీ దసరా రేంజ్ లో అయితే లేవు…
అయినా కూడా ఓవరాల్ గా మొదటి రోజు ఇప్పుడు సినిమా తెలుగు రాష్ట్రాల్లో 7కోట్లు ఆ పైన కనుక షేర్ ని అందుకుంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ అని చెప్పొచ్చు. అంతకుమించి వస్తే ఇక అది మాస్ జాతర అనే చెప్పాలి… ఇక తొలిరోజు టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా…
11-12కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉంది. మరి సినిమా మొత్తం మీద మొదటి రోజు ఈ అంచనాలను మించిపోతుందా లేక ఇదే రేంజ్ లో వసూళ్ళని అందుకుంటుందో చూడాలి ఇక…