Home న్యూస్ 1st డే సింగిల్ మూవీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్!!

1st డే సింగిల్ మూవీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు పర్వాలేదు అనిపించే అంచనాల నడుమ యంగ్ హీరో శ్రీ విష్ణు(Sree Vishnu) నటించిన కొత్త సినిమా సింగిల్(Single Movie) మూవీ ఉన్నంతలో గ్రాండ్ రిలీజ్ నే సొంతం చేసుకుని రిలీజ్ అవ్వగా సినిమాకి ఆడియన్స్ నుండి ముఖ్యంగా కామెడీ ఎంటర్ టైనర్స్ ఇష్టపడే…

ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ సొంతం అయ్యింది. దాంతో కలెక్షన్స్ పరంగా షో షోకి మంచి ట్రెండ్ నే చూపెడుతూ దూసుకు పోతున్న సినిమా మొత్తం మీద ప్రీమియర్స్ తోనే 80 వేల డాలర్స్ మార్క్ ని దాటేయగా… ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్స్ తో మంచి జోరుని…

ఓవర్సీస్ లో చూపిస్తున్న సినిమా తెలుగు రాష్ట్రాల్లో కొంచం స్లో స్టార్ట్ నే సొంతం చేసుకున్నా మ్యాట్నీ ల టైం నుండి పర్వాలేదు అనిపించేలా ట్రెండ్ ను చూపెడుతూ ఉండటంతో మొదటి రోజున ఇప్పుడు ఉన్నంతలో డీసెంట్ ఓపెనింగ్స్ ను అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.

ఓవరాల్ గా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తుంటే మొదటి రోజున తెలుగు రాష్ట్రాల్లో 1.5 కోట్ల రేంజ్ లో షేర్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా…ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే షేర్ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంది.

ఇక సినిమా రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లు కలిపి ఓవరాల్ గా 2.2-2.4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే షేర్ ఇంకొంచం పెరిగే అవకాశం ఉంది. ఇక టోటల్ గా మొదటి రోజు సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here