బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ హీరో శ్రీ విష్ణు(Sree Vishnu) నటించిన కొత్త సినిమా సింగిల్(Single Movie) మూవీ ఆడియన్స్ ను మంచి కామెడీతో ఆకట్టుకోగా… మొదటి రోజున అనుకున్న దాని కన్నా కూడా బెటర్ ట్రెండ్ ను చూపించి కలెక్షన్స్ పరంగా సాలిడ్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. స్లో స్టార్ట్ ను సొంతం చేసుకున్నా కూడా…
మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడంతో షో షోకి కలెక్షన్స్ పరంగా జోరు పెంచిన సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు అనుకున్న అంచనాలను మించిపోయే రేంజ్ లో ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని మాస్ కుమ్ముడు కుమ్మేసింది…
తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజున 1.5 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకోవచ్చు అనుకుంటే సినిమా ఈ మార్క్ ని కూడా దాటేసి ఓవరాల్ గా ఈ అంచనాలను దాటేసి 1.62 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకుని మాస్ రచ్చ చేసింది.
ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 2 కోట్ల మార్క్ ని దాటేసి 2.3 కోట్ల షేర్ మార్క్ ని అందుకోగా ఫస్ట్ డే కలెక్షన్స్ ఇలా ఉన్నాయి…
Sree Vishnu Single Movie 1st Day Total WW Collections Report(Inc GST)
👉Nizam: 94L~
👉Ceeded: 16L
👉Andhra: 52L~
AP-TG Total:- 1.62CR(2.60CR~ Gross)
👉KA+ROI+OS : 0.72CR****approx
Total WW Collections: 2.34CR(Gross – 4.10CR~)
(34%~ Recovery)
ఓవరాల్ గా సినిమా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 7 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 4.66 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా…వీకెండ్ లో సినిమా మంచి జోరుని చూపించే అవకాశం ఎంతైనా ఉంది…