Home న్యూస్ చరిత్ర సృష్టించిన స్త్రీ2….76 కోట్లతో రికార్డులు చెల్లాచెదురు!!

చరిత్ర సృష్టించిన స్త్రీ2….76 కోట్లతో రికార్డులు చెల్లాచెదురు!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ లో ఈ ఇయర్ హైప్ ఉన్న సినిమాలు కొన్ని వచ్చాయి కొన్ని రావాల్సి ఉంది, ఓవరాల్ గా హైప్ ఉన్న మూవీస్ లో మరీ భీభత్సంగా కాకపోయినా మంచి హైప్ నడుమ వచ్చిన శ్రద్దా కపూర్(Shraddha Kapoor) మెయిన్ లీడ్ లో నటించిన స్త్రీ2(Stree2 Movie) ఆగస్టు 15 లాంటి నేషనల్ హాలిడే అడ్వాంటేజ్ తో రిలీజ్ అవ్వగా భారీ ఓపెనింగ్స్ వస్తాయి అనుకున్నారు కానీ…

ఏకంగా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసే రేంజ్ లో వసూళ్ళ ఊచకోత అవుతుంది అని అయితే ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ చేయలేదు….కానీ స్త్రీ2 మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ లో ఈ ఇయర్ రికార్డులు, లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో రికార్డులతో పాటు ఎన్నో టాప్ స్టార్స్ నటించిన బిగ్గెస్ట్ మూవీస్ ఓపెనింగ్ డే రికార్డులను సైతం బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది…

ఓవరాల్ గా బాలీవుడ్ ఆల్ టైం టాప్ 2 బిగ్గెస్ట్ డే 1 కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఊహకందని ఊచకోత కోసింది ఈ సినిమా… ఓవరాల్ గా ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్స్ తో కలిపి 45-50 కోట్ల దాకా వసూళ్లు ఉండొచ్చు అనుకున్నా యునానిమస్ పాజిటివ్ టాక్ ఇంపాక్ట్ అలాగే నైట్ షోలకు విపరీతమైన ఓవర్ ఫ్లో కలెక్షన్స్ హెల్ప్ తో….

సినిమా డిమాండ్ ఉన్న చోట్ల మిడ్ నైట్ ఎక్స్ ట్రా షోలు కూడా పడి ఊచకోత కోసిన ఈ సినిమా ఓవరాల్ గా ప్రీమియర్స్ తో 9.40కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా మొదటి రోజు 55.40 కోట్ల మమ్మోత్ నెట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమా ఓవరాల్ గా ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్స్ తో కలిపి ఇప్పుడు ఇండియా లో ఏకంగా…

64.80 కోట్ల హిస్టారికల్ నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మెంటల్ మాస్ జాతర సృష్టించింది. టోటల్ ఇండియా గ్రాస్ మొదటి రోజు 76 కోట్లకు పైగా ఉండగా బాలీవుడ్ చరిత్రలోనే వన్ ఆఫ్ ది ఎపిక్ ఓపెనింగ్స్ ను సాధించింది ఈ సినిమా…సినిమా కుమ్మేసే ఓపెనింగ్స్ వస్తాయని అందరూ అనుకున్నా అది ఈ రేంజ్ లో…

ఉంటుందని అయితే ఎవ్వరూ ఊహించలేదు…అది కూడా పోటిలో అక్షయ్ కుమార్, జాన్ అబ్రహం లాంటి ఇతర స్టార్స్ నటించిన సినిమాలు ఉండటం, అలాగే సౌత్ లో భారీ పోటిలో కలెక్షన్స్ ఇంపాక్ట్ అయినా కూడా ఈ రేంజ్ లో ఊచకోత కోయడం మామూలు విషయం కాదు. ఇక లాంగ్ వీకెండ్ లో ఈ సినిమా భీభత్సం సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here