బాక్స్ ఆఫీస్ దగ్గర యూత్ స్టార్ నితిన్(Nithiin) నటించిన లేటెస్ట్ మూవీ తమ్ముడు(Thammudu Movie) రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా వరల్డ్ వైడ్ గా 950 వరకు థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా మొదటి రోజు కొంచం మిక్సుడ్ రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకోగా ఓపెనింగ్స్ పరంగా సినిమా అనుకున్న రేంజ్ లో…
ఇంపాక్ట్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించ లేకపోతుంది. ఆన్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అలాగే ఆఫ్ లైన్ లో కౌంటర్ దగ్గర టికెట్ సేల్స్ పరంగా కూడా ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ కూడా రీసెంట్ నితిన్ మూవీస్ పోల్చితే అంచనాలను అందుకోవడం లేదు అనే చెప్పాలి.
ఓవరాల్ గా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా మొదటి రోజు ముందు అనుకున్న రేంజ్ లో కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం తక్కువగానే ఉండగా ఓవరాల్ గా సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కోటి రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని…
సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉందని చెప్పాలి… ఇక కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో కూడా అనుకున్న రేంజ్ లో ఓపెనింగ్స్ ఇంపాక్ట్ కనిపించడం లేదు.
దాంతో సినిమా వరల్డ్ వైడ్ గా మొదటి రోజున 1.3-1.5 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఈ ఓపెనింగ్స్ అసలు ఏమాత్రం సరిపోవు అనే చెప్పాలి. ఇక ఫస్ట్ డే అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి ఇప్పుడు.