రిలీజ్ కి ముందు పరిస్థితులు ఎలా ఉన్నా కూడా రిలీజ్ టైంకి అన్నీ అవే సెట్ అవుతూ పవర్ స్టార్ సినిమా అంటే రచ్చ ఖాయం అనిపించేలా పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సాయి ధరం తేజ్(Sai Dharam Tej) ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ బ్రో(Bro The Avatar)…
అన్ని చోట్లా ఎక్స్ లెంట్ స్టార్ట్ నే సొంతం చేసుకుందని చెప్పొచ్చు. సినిమా కి ఆంధ్రలో సాలిడ్ స్టార్ట్ సొంతం అవ్వగా నైజాంలో సిటీలలో మంచి ఆక్యుపెన్సీ సొంతం అయ్యింది కానీ సినిమా విలేజెస్ డిస్ట్రిక్స్ లో మాత్రం భారీ వర్షాల ఎఫెక్ట్ వలన బుకింగ్స్ కి ఎఫెక్ట్ ఉంది.
అలాగే సినిమా జానర్ దృశ్యా సీడెడ్ లో కూడా సినిమా బుకింగ్స్ పై కొంచం ఎఫెక్ట్ ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ గా చూసుకుంటే మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల బుకింగ్స్ ఆక్యుపెన్సీ 55% రేంజ్ లో ఉందని చెప్పాలి ఇప్పుడు. ఈవినింగ్ అండ్ నైట్ షోల…
బుకింగ్స్ కూడా జోరుగానే కొనసాగుతూ ఉండటంతో సినిమా మొత్తం మీద ప్రస్తుత పరిస్థితులలో కూడా సాలిడ్ స్టార్ట్ నే సొంతం చేసుకోబోతుంది. ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా జోరు ఇలానే కొనసాగిస్తే తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉంది.
ఇక అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు, ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సాలిడ్ జోరుని చూపిస్తే కలెక్షన్స్ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక సినిమా రోజు ముగిసే సరికి ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి ఇప్పుడు…