నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమా దసరా కానుకగా రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా కూడా కలెక్షన్స్ పరంగా మాత్రం స్లో స్టార్ట్ ను సొంతం చేసుకోవడం ఇప్పుడు…
లాంగ్ రన్ లో బ్రేక్ ఈవెన్ కోసం కష్టపడేలా చేస్తూ ఉండగా సినిమా మంచి లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ ఉన్నప్పటికీ కూడా సినిమా బ్రేక్ ఈవెన్ వైపు ఒక్కో అడుగు ముందుకేస్తూ ఉండగా సినిమా ఇప్పుడు 18వ రోజు సండే అడ్వాంటేజ్ తో మంచి జోరుని చూపించింది…
దాంతో సినిమా 18వ రోజు సాధించిన కలెక్షన్స్ తో ఓవరాల్ గా సినిమా బిజినెస్ మార్క్ ని రికవరీ చేసింది… 17వ రోజుల్లో సినిమా 67.10 కోట్ల షేర్ ని అందుకోగా సినిమా టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ 67.35 కోట్ల దాకా ఉండగా సినిమా 18వ రోజు సాధించిన కలెక్షన్స్ తో బిజినెస్ ను రికవరీ చేసి ఇప్పుడు…..
మైనర్ ప్రాఫిట్స్ లోకి ఎంటర్ అవుతుంది… సినిమా ఇక బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే 68.50 కోట్ల షేర్ మార్క్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా 18వ రోజు కలెక్షన్స్ తో బిజినెస్ ను దాటేసి టోటల్ బ్రేక్ ఈవెన్ మార్క్ వైపు సినిమా ఒక్క అడుగు దూరంలో ఉందని చెప్పాలి.
సినిమా మిగిలిన రన్ లో సాధించే కలెక్షన్స్ తో ఆ బాలెన్స్ అమౌంట్ ను కూడా రికవరీ చేసి క్లీన్ హిట్ గా నిలిచే అవకాశం ఎంతైనా ఉంది. ఇక ఓవరాల్ గా లాంగ్ రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ తో దుమ్ము లేపుతుందో చూడాలి ఇక…