బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ వీక్ ఆడియన్స్ ముందుకు మంచి అంచనాల నడుమ వచ్చిన విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఛావా సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ తో హిస్టారికల్ జానర్ మూవీస్ లో ఎపిక్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని మాస్ భీభత్సం సృష్టించింది. ఇక వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టిన తర్వాత సినిమా స్లో అవ్వాల్సిన చోట…
మాస్ రచ్చ చేస్తూ వీకెండ్ కి ఏమాత్రం తీసిపోని విధంగా వర్కింగ్ డేస్ లో వసూళ్ళ భీభత్సం సృష్టించిన ఛావా సినిమా 6వ రోజున ఛత్రపతి శివాజీ మహారాజ్ పుట్టిన రోజు సందర్భంగా అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా 7వ రోజున మరో ఫుల్ వర్కింగ్ డే లో…
అనుకున్న రేంజ్ లో హోల్డ్ ని చూపించి కుమ్మేసిన సినిమా 6వ రోజుతో పోల్చితే 30% రేంజ్ లోనే డ్రాప్స్ ను సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ హోల్డ్ తో 21.60 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని రిమార్కబుల్ ఫస్ట్ వీక్ ని కంప్లీట్ చేసుకుంది ఇప్పుడు….
ఒకసారి సినిమా డే వైజ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
#Chhaava Sensational Collections
👉Day 1 – 33.10CR
👉Day 2 – 39.30CR
👉Day 3 – 49.03CR
👉Day 4 – 24.10CR
👉Day 5 – 25.75CR
👉Day 6 – 32.40CR
👉Day 7 – 21.60CR
Total collections – 225.28CR NET💥💥💥💥
ఓవరాల్ గా సినిమా వరల్డ్ వైడ్ గా కూడా మొదటి వారంలో 320 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుని ఊహకందని రేంజ్ లో మాస్ రచ్చ చేసింది. ఇక ఇండియా లో సినిమా ఎపిక్ రన్ ని కొనసాగిస్తూ ఉండటంతో రెండో వీకెండ్ లో సినిమా మరోసారి…
ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో ఊచకోత కోయడం ఖాయమని చెప్పాలి. ఓవరాల్ గా రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ ని హిస్టారికల్ మూవీస్ లో సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న ఛావా సినిమా లాంగ్ రన్ లో 500 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ వైపు దూసుకు పోతుంది అని చెప్పాలి ఇప్పుడు.