Home న్యూస్ ఇటు 27 అటు 44….కన్నప్ప రికార్డ్ 1st వీక్….కానీ!!

ఇటు 27 అటు 44….కన్నప్ప రికార్డ్ 1st వీక్….కానీ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ వీక్ లో భారీ లెవల్ లో రిలీజ్ అయిన మంచు విష్ణు(Manchu Vishnu) నటించిన లేటెస్ట్ మూవీ కన్నప్ప(Kannappa) మూవీ ఉన్నంతలో పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా వీకెండ్ వరకు కలెక్షన్స్ పరంగా పర్వాలేదు అనిపించేలా జోరు చూపించిన సినిమా…

వర్కింగ్ డేస్ లోకి వచ్చేసరికి మాత్రం అనుకున్న దాని కన్నా కూడా ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుని ఇప్పుడు కష్టంగానే మొదటి వీక్ ని కంప్లీట్ చేసుకుంది ఇప్పుడు…ఓవరాల్ గా సినిమా అందుకోవాల్సిన మమ్మోత్ టార్గెట్ దృశ్యా చూసుకుంటే…

ఈ కలెక్షన్స్ అసలు ఏమాత్రం సరిపోవు అనే చెప్పాలి. ఓవరాల్ గా సినిమా 7వ రోజున వరల్డ్ వైడ్ గా 1.3 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకోగా ఈ రోజు కలెక్షన్స్ తో సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారం కంప్లీట్ అయ్యే టైంకి సినిమా…

27 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 44 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుని ఫస్ట్ వీక్ ని కంప్లీట్ చేసుకుంది ఇప్పుడు…మొత్తం మీద సినిమా ఫస్ట్ వీక్ లో మంచు విష్ణు కెరీర్ లోనే…

ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుందని చెప్పాలి. విష్ణు కెరీర్ కి తిరిగి ఎంతో కొంత ఊపిరి పోసినప్పటికీ కూడా సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా చూసుకుంటే సినిమా ఫైనల్ రిజల్ట్ ఆల్ మోస్ట్ కన్ఫాం అయిందనే చెప్పాలి. ఇక సెకెండ్ వీక్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Kannappa Movie 6 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here