లాస్ట్ వీక్ లో ఆడియన్స్ ముందుకు డీసెంట్ అంచనాల నడుమ రిలీజ్ అయిన యంగ్ హీరో శ్రీ విష్ణు(Sree Vishnu) నటించిన కొత్త సినిమా సింగిల్(Single Movie) మూవీ మంచి పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా కూడా మంచి జోరుని చూపించి మొదటి వారంలో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని అందుకుంది..
వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ ని దాటేసిన ఈ సినిమా వర్కింగ్ డేస్ లో కొంచం స్లో అయినా కూడా స్టడీగానే వసూళ్ళని అందుకుని జోరు చూపించి మొదటి వారంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది ఇప్పుడు. మొత్తం మీద సినిమా ఇప్పుడు…
బాక్స్ ఆఫీస్ దగ్గర 7వ రోజున లిమిటెడ్ డ్రాప్స్ నే అందుకుని 51 లక్షల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకుని ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపించగా వరల్డ్ వైడ్ గా 62 లక్షల రేంజ్ లో షేర్ ని 1.20 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకుని ఫస్ట్ వీక్ ని కంప్లీట్ చేసుకుంది.
దాంతో ఓవరాల్ గా ఇప్పుడు సినిమా మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Sree Vishnu Single Movie 7 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 3.90Cr~
👉Ceeded: 96L
👉Andhra: 3.75Cr~
AP-TG Total:- 8.61CR(15.50CR~ Gross)
👉KA+ROI+OS : 2.85CR****approx
Total WW Collections: 11.46CR(Gross – 21.55CR~)
ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 7 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ తో 4.46 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక రెండో వీక్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ తో జోరుని కొనసాగిస్తుందో చూడాలి….