బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకే రోజు పోటిలో రిలీజ్ అయిన సినిమాలు హిట్ గా నిలవడమే ఎక్కువ అంటే ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో లాభాలను కూడా భారీగా సొంతం చేసుకోవడం మాత్రం లాస్ట్ ఇయర్ ఈ రోజు రిలీజ్ అయిన 2 సినిమాలకు సొంతం అవుతుంది అని చెప్పాలి.
లాస్ట్ ఇయర్ జూన్-జులై లో రిలీజ్ అయిన సినిమాలు అన్నీ ఫ్లాఫ్ అయిన తర్వాత ఆగస్ట్ 5న ఆడియన్స్ ముందుకు కళ్యాణ్ రామ్(Kalyan Ram) నటించిన బింబిసార(Bimbisara) దుల్కర్ సల్మాన్(Dulquer Salman) నటించిన సీతా రామం(SitaRamam)…
రెండు సినిమాలు మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుని లాంగ్ రన్ లో ఊహకందని కలెక్షన్స్ తో భారీ లాభాలను సొంతం చేసుకున్నాయి. బింబిసారతో కంబ్యాక్ ను సొంతం చేసుకున్న కళ్యాణ్ రామ్ 15.60 కోట్ల బిజినెస్ మీద టోటల్ రన్ లో ఏకంగా….
22.32 కోట్ల రేంజ్ మమ్మోత్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపగా ఇదే రోజున రిలీజ్ అయిన సీతారామం సినిమా 16.20 కోట్ల బిజినెస్ మీద టోటల్ రన్ లో ఏకంగా 30.30 కోట్ల రేంజ్ హ్యుమంగస్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఈ రెండు సినిమాలు కలిపి టోటల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 31.80 కోట్ల రేంజ్ బిజినెస్ మీద టోటల్ రన్ లో ఏకంగా 52.62 కోట్ల హిస్టారికల్ ప్రాఫిట్ ను సొంతం చేసుకున్నాయి. చరిత్రలో ఇలా ఒక రోజు రిలీజ్ అయిన 2 పెద్దగా అంచనాలు లేని సినిమాలు ఈ రేంజ్ లో ప్రాఫిట్స్ ను అందుకోవడం మామూలు విషయం కాదనే చెప్పాలి.