యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన లేటెస్ట్ మూవీ ఏ1 ఎక్స్ ప్రెస్ బాక్స్ ఆఫీస్ దగ్గర 25 వ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ పోటి లో రిలీజ్ అయిన అన్ని సినిమాలలోకి డీసెంట్ ఓపెనింగ్స్ ని మొదటి రోజు సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే సాధించినాల్సిన రేంజ్ కలెక్షన్స్ ని అందుకోలేదు.
సినిమా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర గ్రోత్ ని సొంతం చేసుకుంటుంది, మినిమమ్ 70-80 లక్షలకు తగ్గని కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది అని భావించినా కానీ సినిమా అనుకున్న రేంజ్ కలెక్షన్స్ ని అందుకోలేక పోయింది. సినిమా రెండో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో..
68 లక్షల షేర్ ని మాత్రమె సొంతం చేసుకుంది, దాంతో ఇప్పుడు మూడో రోజు సినిమా రెట్టించిన జోరు తో కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 2 రోజుల్లో టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే…
👉Nizam: 47L
👉Ceeded: 15L
👉UA: 20L
👉East: 16L
👉West: 11L
👉Guntur: 13L
👉Krishna: 13L
👉Nellore: 9L
AP-TG Total:- 1.44CR (2.50Cr Gross~)
Ka+ROI: 4L
Os – 2L
Total WW: 1.50Cr(2.65cr Gross~)
ఇదీ మొత్తం మీద సినిమా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ లెక్క. సినిమా ను టోటల్ గా 4.6 కోట్ల రేటు కి బాక్స్ ఆఫీస్ దగ్గర అమ్మగా…
సినిమా 5 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగగా రెండు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 3.5 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది, అది జరగాలి అంటే సినిమా మూడో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో కోటి కి తగ్గని షేర్ ని సాదించాలి. అలా అయితేనే వర్కింగ్ డేస్ లో కొంచం స్లో అయినా బ్రేక్ ఈవెన్ కి చేరువ అవుతుంది…