బాక్స్ ఆఫీస్ దగ్గర నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ అంటే సుందరానికీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా సినిమా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా రీసెంట్ టైం లో నాని కెరీర్ లో లోవేస్ట్ ఓపెనింగ్స్ ని అందుకున్న సినిమాగా నిలిచింది. ఇక పాజిటివ్ టాక్ ఉండటంతో సినిమా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హోల్డ్ ని సొంతం చేసుకుంది.
సినిమా రెండో రోజు తెలుగు రాష్ట్రాలలో 3 కోట్ల నుండి 3.3 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంటుంది అనుకోగా సినిమా ఫైనల్ డే 2 కలెక్షన్స్ లెక్క తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు 3.48 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది.
ఇక సినిమా రెండో రోజు వరల్డ్ వైడ్ గా రెండో రోజు 4.78 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా 8.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది. అమెరికాలో సినిమా $650K మార్క్ ని క్రాస్ చేసి 1 మిలియన్ వైపు దూసుకు పోతుంది. ఇక సినిమా మొత్తం మీద 2 రోజులు పూర్తీ అయ్యే టైం కి….
బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 3.10Cr
👉Ceeded: 75L
👉UA: 82L
👉East: 64L
👉West: 56L
👉Guntur: 60L
👉Krishna: 51L
👉Nellore: 37L
AP-TG Total:- 7.35CR(12.40CR~ Gross)
👉KA+ROI:- 65L
👉OS: 2.60Cr
Total WW:- 10.60CR(18.50CR~ Gross)
ఇదీ మొత్తం మీద రెండు రోజుల్లో అంటే సుందరానికీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్ లెక్క…
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 30 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకోగా 31 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 20.40 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంటేనే బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇక సినిమా 3వ రోజు ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి….