హార్ట్ టచింగ్ లవ్ స్టొరీ కలర్ ఫోటో రీసెంట్ గా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా సినిమా కి రివ్యూలు అంత ఆకట్టుకునేలా రాకున్నా కానీ జనాలు మాత్రం వాటికి ఏమాత్రం కేర్ చేయకుండా విరగబడి సినిమా ను చూస్తున్నారు. రీసెంట్ టైం లో ఈ సినిమా కి దక్కినన్ని ప్రశంసలు సోషల్ మీడియా లో మరే సినిమా కి కూడా దక్కలేదనే చెప్పాలి.
ఆ రేంజ్ లో సినిమా లో లీడ్ పెయిర్ ఆకట్టుకోవడం సినిమా సాంగ్స్ బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బాగా మెప్పించడం లాంటివి సినిమా కి మరింత హెల్ప్ అవ్వగా సినిమా ను కొన్న ఆహా వీడియో లో సినిమా కి ఇప్పుడు సాలిడ్ గా వ్యూస్ దక్కుతున్నాయట.
సినిమా కి మొదటి రోజు ఆహా వీడియో లో సుమారు 2 లక్షల 15 వేల యూనిక్ వ్యూస్ దక్కినట్లు సమాచారం. ఇది అద్బుతమైన స్టార్ట్ కాగా సినిమా వీకెండ్ 2 రోజుల్లో కూడా మరింత జోరు చూపి మొత్తం మీద 3 లక్షల 45 వేల దాకా యూనిక్ వ్యూస్ ని సొంతం చేసుకుని వీకెండ్ ని ముగించింది అంటున్నారు ఇప్పుడు.
అంటే సినిమా కి సెన్సేషనల్ అనిపించే రేంజ్ లో యూనిక్ వ్యూస్ దక్కగా వీటి ద్వారా ఎంత కలెక్షన్స్ రావొచ్చు అనేది ఒక ఎస్టిమేషన్ వేసుకుంటే…. ఆహా యాప్ 1 నెల రేటు 50 తో ఈ వ్యూస్ ని లెక్కేస్తే.. 1.72 కోట్ల దాకా రెవెన్యూ ని ఈ సినిమా జనరేట్ చేసి ఉండొచ్చని అంచనా వేయవచ్చు.
కాగా సినిమా కోసం సుమారు 3 కోట్లు ఖర్చు చేసిన ఆహా యాప్ కి ఈ సినిమా లాంగ్ రన్ లో అల్టిమేట్ ప్రాఫిట్స్ ని తెచ్చి పెట్టె అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఈ లెక్కలను నిజం అనుకుంటే… మొదటి వారానికే సినిమా అల్టిమేట్ వ్యూస్ తో డిజిటల్ సూపర్ హిట్ అనిపించుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు.